Aditya-L1: జనవరి 6న గమ్యస్థానానికి ఆదిత్య ఎల్1
ఇస్రో నుంచి కీలక ప్రకటన వచ్చింది. 'ఆదిత్య ఎల్1' జనవరి 6వ తేదీ నాటికి తన గమ్యస్థానాన్ని చేరుకోనుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఆ రోజున లగ్రాంజ్ పాయింట్-1లోకి ప్రవేశిస్తుందన్నారు.
ఇస్రో నుంచి కీలక ప్రకటన వచ్చింది. 'ఆదిత్య ఎల్1' జనవరి 6వ తేదీ నాటికి తన గమ్యస్థానాన్ని చేరుకోనుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఆ రోజున లగ్రాంజ్ పాయింట్-1లోకి ప్రవేశిస్తుందన్నారు.
2040 నాటికి చంద్రునిపై తొలిసారిగా భారత వ్యోమగామిని దింపుతామని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. రోదసి యాత్రల కోసం నలుగురు వ్యోమగామి అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. అయితే వీళ్లందరూ కూడా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లని పేర్కొన్నారు.
ఆదిత్య ఎల్-1 సూర్యుని అరుదైన ఫొటోలు తీసింది. సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ పేలోడ్ సూర్యుని నుంచి 200 నుంచి 400 నానో మీటర్ల తరంగదైర్ఘ్య పరిధిలోని ఫొటోలను తీసింది. దీనివల్ల సూర్యుని ఫొటోస్పియర్, క్రోమోస్పియర్లకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ఇస్రో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా ప్రయోగించిన ప్రొపల్షన్ మాడ్యుల్‌ను చంద్రుని కక్ష్య నుంచి భూ కక్ష్య వరకు మళ్లించినట్లు ఇస్రో ప్రకటన చేసింది. కక్ష్య పొడగింపు, ట్రాన్స్ ఎర్త్ ఇంజెక్షన్ విన్యాసాలతో దీన్ని పూర్తి చేసినట్లు పేర్కొంది.
ఆదిత్య ఎల్-1 ప్రయోగానికి సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేసింది ఇస్రో. ఆదిత్య ఎల్-1 లో సౌర గాలులు రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించి గ్రాఫ్‌తో కూడిన వివరాలను ట్వీట్ చేసింది ఇస్రో. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి ఇది 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇండియాలో ఏర్పాటైన ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ వంటి సంస్థలతో భారత అంతరిక్ష రంగ పురోగతికి బలమైన పునాదులు పడతాయన్నారు.
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 ప్రయోగం తుది దశకు చేరుకుందని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. ఈ వ్యోమనౌకను ఎల్1 పాయింట్లో ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7 నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు.
చంద్రయాన్-3ని విజయవంతగా చేపట్టిన ఇస్రో ఇప్పుడు చంద్రయాన్-4 ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ ప్రయోగంలో భాగంగా జాబిల్లి పైనుంచి మట్టి నమునాలను, రాళ్లను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్1 మరో ఘనతను సాధించింది. ఆ వ్యోమనౌకలో ఉన్న 'హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్' మొదటిసారి సౌర జ్వాలలకు సంబంధించి హై ఎనర్జీ ఎక్స్‌రే చిత్రాన్ని ఫొటో తీసింది. ఈ పరికరంతో పూర్తిస్థాయి పరిశీలనలు చేసేందుకు సిద్ధమవుతోంది ఇస్రో.