Iran: ఇరాన్లో ఉద్రిక్తతలు.. భారతీయులకు కీలక ఆదేశాలు
ఇరాన్‌లోని భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ భయాందోళనకు గురికావొద్దని టెహ్రాన్‌లోని దేశ రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచించింది.
ఇరాన్‌లోని భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ భయాందోళనకు గురికావొద్దని టెహ్రాన్‌లోని దేశ రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచించింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ అమెరికాపైకి దాడులకు దిగితే తమ బలగాలు ఇరాన్‌పై విరుచుకుపడతాయని హెచ్చరించారు.
ఇరాన్ పై ఇజ్రాయెల్ పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేస్తోంది. ఇరాన్ లో ఇరాన్ చమురు డిపోలు,శుద్ధి కర్మాగారాల నుంచి అణు కేంద్రాల వరకు అన్నింటిపైనా దాడులు చేస్తోంది.ఈ దాడుల్లో ఇప్పటి వరకు 130 మందితో పాటూ తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు, అగ్ర కమాండర్లున్నారు.
ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు మీద దాడులు చేస్తోంది. దీనికి కారణం అణు ముప్పే అని చెబుతోంది. కానీ అసలు టార్గెట్ మాత్రం ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేయడమే అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనిలో అవి దారుణంగా దెబ్బతిన్నాయని చెబుతోంది. దానికి సంబంధించిన ఫొటోలను కూడా బయటపెట్టింది. అదే కనుక నిజమైతే ఇరాన్ అణు కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పడినట్టే అని అంటున్నారు.