Israel-Iran: ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు..అమెరికాకు నిఘా సమాచారం
ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తోందని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ఇంకా ఆలోచనలోనే ఉందని...తుది నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.
ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తోందని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ఇంకా ఆలోచనలోనే ఉందని...తుది నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.
గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో వేలాదిమంది తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అక్కడి పిల్లలకు ఆహారం దొరకక వేలమంది శిశువులు చనిపోతున్నారని ఐరాస తెలిపింది. మరో 48 గంటల్లో వారికి ఆహారం అందకపోతే 14 వేలమంది పసివాళ్లు మరణించే అవకాశం ఉందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.
గాజాలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై శనివారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 103 మంది మృతి చెందారు. వీళ్లలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతూనే ఉంది. దాడుల్లో ఒక్క రోజులోనే 115 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతలాకుతలం అయిపోయిన గాజా...ఇజ్రాయెల్ తాజా దాడులతో మరింత దారుణ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది.
తాజాగా దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్, దేర్ అల్బలా నగర శివార్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు జరిగిన ఈ దాడుల్లో 82 మంది మృతి చెందారు.
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. 10 నిమిషాల పాటు ఈ దాడులు చేసింది. ఈ ఘటనలో ఏకంగా 54 మంది పౌరులు మృతి చెందారు. వందలాది మంది గాయాలపాలయ్యారు.