IND VS NZ: మరో వికెట్ కోల్పోయిన కివీస్.. స్టార్ బ్యాటర్ ఔట్
న్యూజిలాండ్ మరో వికెట్ కోల్పోయింది. స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 37 పరుగుల చేసి పెవిలియన్‌కు చేరాడు.
న్యూజిలాండ్ మరో వికెట్ కోల్పోయింది. స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 37 పరుగుల చేసి పెవిలియన్‌కు చేరాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ VS న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి 1 వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది.
కివిస్ ఓపెనర్ విల్ యంగ్ ఔటయ్యాడు. 23 బాల్స్‌లో 15 పరుగులు చేశాడు. భారత్ స్పిన్నర్ వరణ్ చక్రవర్తి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. దీంతో కివీస్ 8 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 56 పరుగులు చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మొదటి బ్యాటింగ్ చేస్తోన్న కివీస్ నిలకడగా ఆడుతోంది. ఇందులో భాగంగా భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. షమీ చేతికి తీవ్రగాయం అయింది. బౌలింగ్ చేసే క్రమంలో క్యాచ్ పట్టబోయి చేతికి తగిలింది.
కివీస్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లు విల్ యంగ్, రవీంద్ర క్రీజ్‌లో దుమ్ము దులిపేస్తున్నారు. ఫోర్లు, సిక్స్‌లను రాబడుతున్నారు. 5ఓవర్లు ముగిసే సరికి 0 వికెట్లకు 37 పరుగులు చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టాస్ గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా విల్ యంగ్, రవీంద్ర క్రీజ్‌లోకి దిగారు. భారత్ తరఫున మహమ్మద్ షమీ మొదటి బౌలింగ్ వేశాడు. ఫస్ట్ ఓవర్ ముగిసే సరికి కివీస్ 0 వికెట్ల తేడాతో నాలుగు పరుగులు చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ జట్టులో కొన్ని మార్పులు జరిగాయి. తుది జట్టులో గాయం కారణంగా మ్యాట్ హెన్రీ దూరం అయ్యాడు. ఇది న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ అనే చెప్పాలి. హెన్రీ స్థానంలో నాథన్ స్మిత్‌కు అవకాశం వచ్చింది.
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ పోరు ఇవాళ రసవత్తరంగా జరగనుంది. న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమ్ఇండియా వరుసగా 15వ సారి టాస్‌ను కోల్పోయింది. రోహిత్ మాట్లాడుతూ ఫస్ట్ బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఏదైనా పెద్దగా మార్పులేదని అన్నాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ నేడు దుబాయ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో గెలిచిన జట్టుకు ఐసీసీ ప్రైజ్ మనీ కింద రూ.19.5 కోట్లు ఐసీసీ ఇవ్వనుంది. రన్నరప్ జట్టుకు రూ.9.78 కోట్లు ఇస్తారు. సెమీసీలో ఓడిపోయిన జట్టులకు రూ. 4.89 కోట్లు లభిస్తుంది.