వడగళ్ల వర్షం.. విమానానికి రంధ్రం
వడగళ్ల వర్షంతో విమానం ముందు భాగానికి రంధ్రం ఏర్పడింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు అధికారులు. ఈ ఘటన ఇటలీలోని మిలాన్ ఎయిర్ పోర్టులో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు..
వడగళ్ల వర్షంతో విమానం ముందు భాగానికి రంధ్రం ఏర్పడింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు అధికారులు. ఈ ఘటన ఇటలీలోని మిలాన్ ఎయిర్ పోర్టులో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు..
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాగా మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్ లో వాన దంచికొట్టింది. సోమవారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ...వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు పడుతుండటంతో భారత వాతావరణ శాఖ రైతులకు కీలక సూచనలు చేసింది. పంటలను కాపాడుకోవడానికి కొన్ని సలహాలను అనుసరించాలని తెలిపింది. అదే సమయంలో భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో (Telangana, Ap) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత నాలుగు రోజుల నుండి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రాజెక్టుల వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లను ఎత్తివేస్తున్నారు అధికారులు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా తెలంగాణ (Telangana) వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, హైదరాబాద్ మహానగరంలో కూడా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. అటు, జంట జలాశయాలతో పాటుగా హుస్సేన్ సాగర్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను అప్రమత్తం చేశారు. ఎటువంటి పరిస్ధితులనైనా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ టీం పనిచేస్తోందని ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.