షుగర్ పేషెంట్స్‌కు బెస్ట్ ఫుడ్స్..
మధుమేహ బాధితులు షుగర్ లెవల్స్ సరిగా మేనేజ్ చేసే ఆహారం తినాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ, తీవ్రమైన అనారోగ్యాల ముప్పును తగ్గించే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ వీరికి మంచివని వైద్యులు చెబుతున్నారు.
మధుమేహ బాధితులు షుగర్ లెవల్స్ సరిగా మేనేజ్ చేసే ఆహారం తినాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ, తీవ్రమైన అనారోగ్యాల ముప్పును తగ్గించే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ వీరికి మంచివని వైద్యులు చెబుతున్నారు.
వేసవిలో పెరుగు తీసుకోవడం వల్ల పొట్టకు చాలా మేలు జరుగుతుంది. ఇందులో ఉండే కూలింగ్ ఏజెంట్ వేసవి తాపం నుండి మిమ్మల్ని కాపాడుతుంది. మీ జీర్ణక్రియను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.దోసకాయతో రైతా తయారు చేయడం ద్వారా లేదా మజ్జిగ చేయడం ద్వారా పెరుగును అనేక రూపాల్లో తీసుకోవచ్చు.
క్యాన్సర్ భూతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఏం తినాలన్నా భయం, చివరకు గాలి పీల్చాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు. అన్నింటిలోనూ కల్తీలు..దేనికీ లేని సేఫ్టీ. తాజాగా భారత్‌లో 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలున్నాయని ఫుడ్ స్టేఫీ విబాగం చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రయాణికులు , రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ కొత్త కొత్త ఆఫర్లను, సదుపాయాలను తీసుకువస్తోంది. ఇప్పుడు కొత్తగా సమ్మర్ రష్ను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇక మీదట రూ.20 కే భోజనాన్ని అందిస్తామని ప్రకటించింది.
మార్కెట్లో మనకు వివిధ రకాల హెల్త్ డ్రింక్స్ లభిస్తున్నాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు, పెద్దల ఆరోగ్యానికి మంచివనే ప్రకటనలూ రోజూ చూస్తుంటాం. అయితే ఇటీవల వాణిజ్య మంత్రిత్వ శాఖ కొన్ని డ్రింక్స్‌ను హెల్తీ డ్రింక్స్ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది.అవేంటో చూసేయండి!
బొప్పాయి వేసవిలో కూడా సమృద్ధిగా దొరుకుతుంది. బరువు తగ్గించే ఆహారంలో బొప్పాయిని తప్పకుండా చేర్చుకోండి. ఇది ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. బొప్పాయిలో పోషకాలు ఉన్నాయి. ఇవి బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. బొప్పాయి తినడం వల్ల ఎక్కువ ఫైబర్, తక్కువ కేలరీలు లభిస్తాయి.
పాలు, గుడ్లు తక్కువ ప్యూరిన్ కంటెంట్ కలిగి ఉంటాయి కాబట్టి వాటిని ఆహారంలో చేర్చుకోవచ్చు. మొక్కల ప్రోటీన్లు, పాల ఉత్పత్తులు, చేపలను కూడా ఆహారంలో చేర్చవచ్చు. కాఫీని కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
రక్తహీనతను తొలగించడానికి బీట్రూట్ చాలా ప్రయోజనకరమైన కూరగాయగా చెప్పుకొవచ్చు. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే రక్తహీనత ఉన్నవారు బీట్రూట్ తినమని వైద్యులు సూచిస్తున్నారు. దీన్ని కూరగాయలు, రసం, రైతా లేదా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు.
కొలెస్ట్రాల్ తగ్గించడానికి, చక్కెరకు బదులుగా ఖర్జూరం వంటి వాటిని ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల కొలెస్ట్రాల్‌ను పెంచడంలో కూడా పాత్ర పోషిస్తున్న చక్కెర హాని నుండి శరీరాన్ని రక్షించుకోవచ్చు. కాబట్టి, చేయాల్సిందల్లా వీలైనంత సహజ చక్కెరను ఉపయోగించడం.