Telangana News: హైదరాబాద్ గురుకులంలో అగ్ని ప్రమాదం.. విద్యార్థులకు గాయాలు
గురుకుల పాఠశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ గురుకుల పాఠశాలలో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
గురుకుల పాఠశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ గురుకుల పాఠశాలలో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్య క్సేత్రం అయిన శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లో అర్థరాత్రి సమయంలో ఎల్ బ్లాక్ సముదాయంలో ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 15 షాపులు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాద సమాచారం అందుకున్న దేవస్థానం అధికారులు వెంటనే.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని, ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో సుమారు రెండు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారు జామున ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుంది.
కొద్దిరోజులుగా ఏదో ఒక చోట అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. వరస అగ్ని ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. నిన్న ఢిల్లీలో అగ్ని ప్రమాదం మరవక ముందే.. తాజాగా మరో ఘటన అందరినీ కలవర పెడుతోంది. ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో అర్థం కాక అందరు ఇబ్బంది పడుతున్నారు.
హైదరాబాద్ నగరాన్ని అగ్ని ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి.
సముద్రంలో కార్లతో ప్రయాణిస్తున్న నౌకలో మంటలు చెలరేగడంతో సుమారు 3000 కార్ల బుగ్గి అయ్యాయి. జర్మనీ నుంచి ఈజిప్ట్‌కు బయల్దేరిన ఓ భారీ రవాణా నౌకలో ఒక్కాసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనిని గమనించిన నౌకలోని వారు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వారి వల్ల కాలేదు.