AP News : హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు.. 13 మందిపై చర్యలు!
ఏపీలో ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నెలకొన్న హింసాత్మక ఘటనలపై ‘సిట్’ ఏర్పాటైంది. ఈసీ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం 13 మంది సభ్యులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేస్తూ నివేదిక పంపింది.
ఏపీలో ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నెలకొన్న హింసాత్మక ఘటనలపై ‘సిట్’ ఏర్పాటైంది. ఈసీ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం 13 మంది సభ్యులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేస్తూ నివేదిక పంపింది.
ఏపీ ఆందోళన పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఫలితాలు విడుదల అయిన 15 రోజుల వరకూ కేంద్రబలగాలను రాష్ట్రంలోనే కొనసాగించాలని ఆదేశించింది. అవసరమైతే మరిన్ని బలగాలనూ వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్రహోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ శాతాన్ని ఈసీ వెల్లడించింది. మొత్తం 65.67 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపింది. గత ఎన్నికలతో పోలిస్తే 3 శాతం పెరిగినట్లు ప్రకటించింది. అత్యధికంగా భువనగిరిలో 76.78 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48 శాతం నమోదైనట్లు స్పష్టం చేసింది.
ఎన్నికల సమయంలో ఓటు వేయగానే వేలికి సిరా గుర్తు పెడతారు.ఎన్నికల సమయంలో చేతి వేలి పై వేసిన బ్లూ ఇంక్ అంత త్వరగా చెరిగిపోదు..అసలు ఈ సిరా కథ..కమామిషు గురించి ఈ ఆర్టికల్ లో చదివేయండి.
మరికొన్ని గంటల్లో పోలింగ్ మొదలవనుండగా ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఐదుగురు సీఐలపై వేటు వేసింది. జగన్మోహన్రెడ్డి, అంజూయాదవ్, అమర్నాథ్రెడ్డి, శ్రీనివాసులు, వినోద్‌కుమార్‌లను తిరుపతి నుంచి అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది.
జనసేన నాయకుడు నాగబాబుకు ఈసీ షాక్ ఇచ్చింది. ఓట్లకోసం డబ్బులు తీసుకున్న ప్రజలకు ఓ రాజకీయ పార్టీ ఇంకు గుర్తులు పెడుతుందంటూ ఆరోపించిన వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను నమ్మవద్దని స్పష్టం చేసింది.
నంద్యాలకు అల్లు అర్జున్ రావడంతో భారీగా జనం గుమి కూడిన ఘటనపై ఈసీ సీరియస్ అయ్యింది. 144 సెక్షన్ అమల్లో ఉన్నా జన సమీకరణను అరికట్టలేకపోయారని, ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారంటూ ఎస్పీ, డీఎస్పీ, సీఐపీ విచారణకు ఆదేశించింది ఈసీ.
TG: మంత్రి పొన్నం, కేసీఆర్‌పై ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేసింది. బండి సంజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు, విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుకు ఈసీ స్వీకరించింది.
పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియ పై ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఈసీ తెలిపింది. పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పిస్తే చాలని ఈసీ వివరించింది.