విషాదం.. కొడుకు మరణ వార్త విని తల్లి మృతి
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మద్దింశెట్టి ఆదిబాబు (46) అనే వ్యక్తి అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతిచెందారు. దీంతో మృతుడి తల్లి మహాలక్ష్మీ (76) తీవ్ర అస్వస్థకు గురయ్యారు.ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె కూడా మృతి చెందారు.
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి!
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గైట్ కాలేజీకి చెందిన ప్రవీణ్, కార్తీక్ అనే విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వెనుక నుండి వచ్చిన బొగ్గు లారీ బలంగా ఢీకొని వారిద్దరిపై ఎక్కి రోడ్ పై కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దాంతో విద్యార్థుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
AP: ఇంకా ఏనాళ్లు వరదలకు ఇబ్బంది పడాలి.. బాధితుల ఆవేదన..!
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో వరద నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం వచ్చే వరదలకు తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కనీసం వచ్చే ఏడాదికైనా తమకు పునరావాసానికి ఇళ్ళు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
AP : ముంపు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్.. ఆధికారులకు కీలక ఆదేశాలు..!
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ముంపు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ పర్యటించారు. ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
East Godavari : ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ గుడిలో భక్తులకు బురిడీ
కాకినాడ జిల్లాలో లోవకొత్తూరు వద్ద తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో టెంకాయపాటదారు అక్రమాలకు పాల్పడుతున్న తీరు వెలుగులోకి వచ్చింది. భక్తులు తీసుకుని వచ్చిన కొబ్బరి కాయలను కొట్టకుండా వారి వద్ద ఉన్న టెంకాయ ముక్కలను కడిగి ఇస్తుండడం వీడియోలో కనిపిస్తుంది.
Crime News : జాతీయ రహదారిపై రెచ్చిపోయిన దొంగలు.. ప్రయాణికులను కొట్టి..
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారిపై దొంగలు రెచ్చిపోయారు. ఆగి ఉన్న కారుపై దాడి చేసి అందులోని ప్రయాణికులను కొట్టి వారి నుండి 5 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.
TDP : రాజమండ్రిలో ఉద్రిక్తత.. పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదం.!
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత హయాంలో మోరంపూడి ఫ్లైఓవర్ శిలా పథకంపై ఎంపీ భరత్ పేరు ఉండడంతో టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Dumpyard: డంపింగ్ యార్డ్ లో ఎగిసిపడ్డ మంటలు.. ఊపిరాడక ఇబ్బంది పడుతోన్న స్థానికులు..!
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు డంపింగ్ యార్డ్ లో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. భయంతో స్థానికులు పరుగులు తీశారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
/rtv/media/media_files/2025/02/05/eD2XPjh8CKxNwIMwtgWo.jpg)
/rtv/media/media_files/ihTm5jA9Q7drRttnoe8D.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/accident-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rain-effect.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/collector-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/lova.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/police-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/tdp-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/dumpyard.jpg)