నెవ్వర్ బిఫోర్.. అమరావతిలో అదిరిపోయే డ్రోన్ షో-LIVE
ఏపీలో అమరావతి డ్రోన్ సమ్మిట్ ప్రారంభమైంది. మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌లో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఏపీలో అమరావతి డ్రోన్ సమ్మిట్ ప్రారంభమైంది. మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌లో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఉక్రెయిన్ మీద మళ్ళీ రష్యా దాడులు మొదలుపెట్టింది.ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా చాలా చోట్ల క్షిపణులు, డ్రోన్ లతో విరుచుకుపడింది.ఈ దాడుల కారణంగా అక్కడ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.రష్యా దాడులను అడ్డుకునేందుకు సాయం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూరోపియన్ దేశాలను కోరారు.
పశ్చిమాసియాలో మళ్ళీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. నిన్న తెల్లవారుఝామున ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌లో పేలుళ్ళు సంభవించాయి. అయితే దీని మీద ఇరాన్ స్పందిస్తూ ఇజ్రాయెల్ కనుక దాడులకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని అంది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు భయాందోళనలు కలిగిస్తున్నాయి.మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని అప్పుడే ఇజ్రాయెల్ చెప్పింది. ఈ క్రమంలోనే ఇరాన్ మీద ఇజ్రాయెల్ బాంబులతో దాడికి దిగింది.
ఎవరెన్ని చెప్పినా ఇజ్రాయెల్ మీద ఇరాన్ తన దాడులను ఆపలేదు. 30సెకన్లలో ఇజ్రాయెల్‌పై 7సార్లు మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. దానికి తోడు పైగా ఆత్మరక్షణ కోసమే ఇజ్రాయెల్ మీద దాడులకు దిగాల్సి వచ్చిందని యూఎస్ వేదికగా సంచలన ప్రకటన సైతం చేసింది ఇరాన్.
అనుకున్నట్టుగానే ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడులు మొదలుపెట్టింది. డజన్లకొద్దీ ఆత్మాహుతి డ్రోన్లతో అటాక్ చేయడానికి సిద్ధమైంది. మరో తొమ్మిది గంటల్లో ఇవన్నీ ఇజ్రాయెల్ మీద విరుచుకుపడతాయని తెలుస్తోంది.
అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కోసం డ్రోన్స్ సాయం తీసుకున్నారు పోలీసులు. ఓ మహిళపై దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మహిళ కేకలు వేయడంతో మొక్కజొన్న చేనులో దాక్కున్నాడు. 15ఎకరాలు 6 అడుగుల ఎత్తులో ఉన్న చేనులో దుండగుడిని పట్టుకునేందుకు డ్రోన్ల సాయం తీసుకున్నారు.