Pawan Kalyan : నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఉపముఖ్యమంత్రిగా పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో మంగళవారం సచివాలయానికి పవన్ రానున్నారు.
ఉపముఖ్యమంత్రిగా పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో మంగళవారం సచివాలయానికి పవన్ రానున్నారు.
పాత సినిమాల రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది ప్రస్తుతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా తమ్మడు రీ రిలీజ్ అయింది. దీంతో పవన్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో సభా వేదిక వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు తెల్లవారుజాము నుంచే చేరుకుంటున్నారు. పవన్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ స్పెషల్ బస్సులో అక్కడికి చేరుకుంది.
బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మీద విరుచుకుపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీద ఆరోపణలు చేశారు. అలాగే ఆయనేమైనా ప్రధానమంత్రా అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీదన కూడా మండిపడ్డారు.
ప్రపంచంలో ప్రతి గుండె వెనకా ఒక ప్రేమ కథ దాగి ఉంటుంది. సామాన్యుల నుంచి దేశాలని ఏలే ప్రధానులు, ప్రెసిడెంట్ల వరకూ అందరూ ప్రేమ సముద్రంలో ఎప్పుడో ఒకసారి మునిగినవాళ్లే. అలాంటి వారిలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్, పవర్ ప్రాజెక్టులపై కాంగ్రెస్ గవర్నమెంట్ దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి అధ్యయనం చేయడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మణుగూరు చేరుకున్నారు. అక్కడ థర్మల్ ప్లాంట్ ను పరిశీలించనున్నారు.
తెలంగాణలో డిప్యూటీ సీఎంగా, ఆర్థికశాఖగా బాధ్యతలు చేపట్టిన భట్టి విక్రమార్క ఆర్థికశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయం, వ్యయం, అప్పుల గురించి భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కే రామకృష్ణారావు వివరించారు.
తెలంగాణలో సీఎం రేసులో పీసీసీ చీఫ్ రేవంత్ ముందంజలో ఉండగా.. డిప్యూటీ సీఎం రేసులో ఆరుగురు నేతలు ఉన్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, అద్దంకి దయాకర్ లాంటి నేతలు ఈ పదవికి పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.