CRICKET: ICC కొత్త నిబంధన!
అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఐసీసీ కొత్త నిబంధన తీసుకురాబోతుంది. ఈ నిబంధన జూన్ లో జరగబోయే వరల్ఢకప్ టీ20 నుంచి అమలు కానుంది. అసలు ఏంటి ఈ కొత్త నిబంధన?
అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఐసీసీ కొత్త నిబంధన తీసుకురాబోతుంది. ఈ నిబంధన జూన్ లో జరగబోయే వరల్ఢకప్ టీ20 నుంచి అమలు కానుంది. అసలు ఏంటి ఈ కొత్త నిబంధన?
టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కు ఆస్త్రేలియా స్టార్ క్రికెట ర్ మ్యాథ్యూ వేడ్ వీడ్కోలు ప్రకటించాడు. షెఫీల్డ్ టోర్నీ మార్చి 21 న టాస్మానియా- వెస్ట్ ర్న మధ్య జరిగే ఫైనల్ తన రెడ్ బాల్ క్రికెట్ కు చివరదని వేడ్ స్పష్టం చేశాడు.
ఇండియన్ క్రికెటర్స్‌లో కచ్చితంగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సిందేనని బీసీసీఐ ఇంతకు ముందే ప్రకటించింది. ఇప్పుడు ఒక్కో టెస్ట్ మ్యాచ్‌కూ 45 లక్షలు ఇస్తామంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జైషా కీలక ప్రకటన చేశారు. టెస్ట్ క్రికెట్లో ఇన్సెంటివ్ స్కీమును ప్రవేశపెడుతున్నామని తెలిపారు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. పరుగుల వరద పారిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ శుభ్‌మన్‌గిల్‌లు సెంచరీలతో అదరగొట్టారు. దీంతో భారత స్కోరు లంచ్ బ్రేక్ సమయానికి 60 ఓవర్లకు ఒక వికెట్ నష్టపోయి 264 పరుగులుగా ఉంది.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్ నుంచి పోటీ చేయాలని టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమీకి బీజేపీ ప్రతిపాదన చేసింది. దేశవాళీ క్రికెట్లో బెంగాల్ తరపున షమీ ఆడాడు. బసిర్హత్ లోక్‌సభ స్థానం నుంచి నుస్రత్ జహాన్‌పై షమీని పోటీకి దింపాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
2012 ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాడు టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్. తన తప్పులను గుర్తించి సరిదిద్దుకోవడానికి ఆ సిరీస్ తనకు సహాయపడిందని చెప్పాడు. అశ్విన్ తన కెరీర్లో 100వ టెస్టును రేపు(మార్చి 7) ఆడనున్నాడు.
ఇండియా మాజీ మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనీ మళ్ళీ సస్పెన్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. కొత్త సీజన్...కొత్తపాత్ర.. వెయిట్ చేయలేకపోతున్నా..చూస్తూ ఉండండి అంటూ అందులో రాశాడు. ఇంతకు ముందు కూడా ధోనీ ఇలాంటి పోస్ట్‌లను పెట్టాడు.
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి టెస్టు ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు రెండు జట్లు మాత్రమే మిగిలిన నాలుగు టెస్టులు గెలుచుకున్నాయి. 112ఏళ్ల క్రితం ఇంగ్లండ్ ఇలా చేసింది. మళ్లీ ఆ తర్వాత ఎవరూ ఈ ఫీట్ సాధించలేదు. దీంతో రోహిత్ ఈ కొత్త రికార్డును సమం చేసేందుకు ట్రై చేస్తున్నాడు.
దేశవాళి మ్యాచ్‌లు ఎగ్గొట్టి టైమ్ పాస్ చేసిన శ్రేయస్, ఇషాన్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల జాబితా నుంచి వారి పేర్లు తొలగించింది. ఈ ఏడాది 30 మంది ఆటగాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చిన బీసీసీఐ ఈ ఇద్దరినీ జాబితాలో పెట్టలేదు. అటు రింకూ గ్రేడ్-సీలో ప్లేస్ కొట్టేశాడు.