ఆ నటికి నాన్ బెయిలబుల్ వారెంట్..ఎందుకంటే!
నటి జయప్రదకు యూపీ కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గత ఎన్నికల సమయంలో ఆమె ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించినందుకు ఆమెకు కోర్టు ఈ వారెంట్ ఇష్యూ చేసింది.
నటి జయప్రదకు యూపీ కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గత ఎన్నికల సమయంలో ఆమె ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించినందుకు ఆమెకు కోర్టు ఈ వారెంట్ ఇష్యూ చేసింది.
హైదరాబాద్ పేలుళ్ళ కుట్ర కేసులో ఈరోజు తీర్పు వెలువడింది. మొత్తం పదకొండుమందికి పదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది.
విశాఖ ఎన్ఐఏ ఎడిజె కోర్ట్ లో కోడి కత్తి కేస్ మీద ఈరోజు విచారణ జరిగింది. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ను కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. జనుపల్లి తరుఫు న్యావాది సలీమ్ వాదనలు విన్న అనంతరం కోర్టు కేసును ఈనెల 27కు వాయిదా వేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ల మీద వాదనలు ముగిసాయి. అనంతరం కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం చెబుతామని తెలిపింది.
చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై ఎసిబి కోర్టులో నేడు కూడా వాదనలు కొనసాగనున్నాయి.స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో బెయిల్ , కస్టడీ పిటిషన్ లపై రెండు రోజులుగా ఎసిబి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. నేడు మధ్యాహ్నం 12గంటల నుంచి 1:30 వరకు చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించనున్నారు.
ట్రంప్ మోసగాడే అంటున్నారు న్యూయార్క్ జడ్జి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని కుమారులు పదేళ్ళపాటూ తప్పుడు ఆర్ధిక నివేదికలను సమర్పించారని న్యూయార్క్ జడ్జి స్పష్టం చేశారు.
చంద్రబాబు నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అవినీతి కార్యక్రమాలు చేశారని బొత్స మండిపడ్డారు.