BREAKING: కాంగ్రెస్ కు కత్తి కార్తీక రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కత్తి కార్తీక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది. కాంగ్రెస్ దుబ్బాక టికెట్ తనకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కత్తి కార్తీక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది. కాంగ్రెస్ దుబ్బాక టికెట్ తనకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఢిల్లీ నుంచి జైపూర్‌కు షిఫ్ట్ అయ్యారు. ఆస్తమాతో బాధపడుతున్న సోనియా గాంధీ.. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ కారణంగా మారింత ఇబ్బంది పడుతున్నారు. దీంతో వైద్యుల సలహా మేరకు ఆమె ఢిల్లీ నుంచి జైపూర్‌కు షిఫ్ట్ అయ్యారు.
నారాయణఖేడ్ టికెట్ విషయంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. సురేష్ షెట్కార్‌కు బదులుగా పటోళ్ల సంజీవ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది కాంగ్రెస్. దాంతో సంజీవ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సురేష్ షెట్కార్‌కు ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
ఖమ్మం బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావ్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో.. కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసేందుకు సిద్ధమవగా.. అక్కడా నిరాశే ఎదురైంది. తాను పోటీ చేయాలని భావించిన కొత్తగూడెం సీటును పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్.
కాంగ్రెస్ నేత ఎర్ర శేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ రోజు ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఇదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలైంది. 45 మంది అభ్యర్థులకు సీట్లు కన్ఫామ్ చేస్తూ జాబితా విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, కొండా సురేఖ సహా ఇతర ముఖ్య నేతలకు ఈ జాబితాలో సీట్ కన్ఫామ్ చేశారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ బిగ్ షాక్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. కాంగ్రెస్ రెండో విడత జాబితాలో ఊహించని మార్పులు, చేర్పులు చేశారని సమాచారం. ఈ లిస్ట్‌లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య పేరు రావడం కష్టంగానే కనిపిస్తోందంటున్నారు పార్టీ శ్రేణులు. కాగా, కోరం కనకయ్య ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్‌లను చిత్తుగా ఓడిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొడంగల్ నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌ను ఆహ్వానించానని, ఒకవేళ ఆయన కొడంగల్ నుంచి పోటీ చేయకపోతే.. తానే కామారెడ్డిలో పోటీ చేసేందుకు సిద్ధం అని ప్రకటించారు రేవంత్. అధిష్టానం ఆదేశిస్తే.. పోటీకి సై అన్నారు. తెలంగాణలో హంగ్ కు అవకాశమే లేదని, వందశాతం కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సుమనడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. విభజన హామీలపై రాహుల్ ఎందుకు నోరు తెరవడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ బస్సు యాత్రపై ట్విట్టర్లో నిప్పులు చెరిగారు కేటీఆర్. తెలంగాణ హక్కులపై ఎన్డీయేను ఏనాడూ ప్రశ్నించని రాహుల్‌కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు.