TG-AP : రేపు ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ.. ఈ అంశాలపైనే చర్చలు
తెలుగు రాష్ట్రాల సీఎంలు రేపు ప్రజాభవన్‌లో సమావేశం కానున్న సంగతి తెలిసిందే. విభజన సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాలు పలు అంశాల అజెండాను సిద్ధం చేశాయి. మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తెలుగు రాష్ట్రాల సీఎంలు రేపు ప్రజాభవన్‌లో సమావేశం కానున్న సంగతి తెలిసిందే. విభజన సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాలు పలు అంశాల అజెండాను సిద్ధం చేశాయి. మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణలో త్వరలో కేబినెట్ విస్తరణ జరగనుందని.. మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. శాఖల్లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉందన్నారు. సీతక్కకు హోంమంత్రి పదవి, రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్‌కు కేబినెట్ చోటు దక్కే అవకాశం ఉందన్నారు.
తెలంగాణలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని ప్రభుత్వం నియమించనుంది. నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్కూల్ భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2,000 కోట్లతో పనులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ సీఎం రేవంత్‌ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు.
రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని తమ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందని సీఎం రేవంత్ అన్నారు. ప్రతి పౌరుడికి హెల్త్ కార్డ్ ఇచ్చి.. హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని తెలిపారు. బ్లడ్ గ్రూప్ నుంచి చిన్న, పెద్ద ఆరోగ్య సమస్యలను అందులో పొందుపరుస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశించారు. వరంగల్‌ను హెరిటేజ్ నగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని పేర్కొన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్డుకు భూ సేకరణను పూర్తి చేయాలని సూచించారు.
రైతు రుణమాఫీకి సంబంధించి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రమాణికం కాదని.. కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణలో కొత్త పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీ టూర్‌పై సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చే జరగలేదని తెలిపారు. మా శాఖలకు రావాల్సిన నిధుల కోసం కేంద్ర మంత్రులను కలుస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. క్యాబినెట్ విస్తరణ, కొత్త ఎమ్మెల్యేల చేరిక, తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. ఆపరేషన్ ఆకర్ష్‌పైనా కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.