Ap: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..వారికి ఇక నుంచి నెలకు 10 వేలు!
ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ లా నేస్తం పథకం పేరును న్యాయమిత్రగా మార్చిన సంగతి తెలిసిందే. లాయర్లకు నెలకు గౌరవ వేతనం కింద రూ.10 వేలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయ్యింది.
ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ లా నేస్తం పథకం పేరును న్యాయమిత్రగా మార్చిన సంగతి తెలిసిందే. లాయర్లకు నెలకు గౌరవ వేతనం కింద రూ.10 వేలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయ్యింది.
'దేవర' స్పెషల్ షోలతో పాటూ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. దీనిపై ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు ధన్యవాదాలు తెలిపారు.
సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడిని మాజీ సీఎం జగన్ ఇమిటేట్ చేశారు. ఈ రోజు పిఠాపురంలో పర్యటించిన జగన్.. మీకు 15 వేలు.. మీకు 15 వేలు.. అంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కేంద్రం నుంచి సహాయం వచ్చిందన్న మాట అవాస్తవమని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. తాము ఇంకా కేంద్రానికి రిపోర్ట్ పంపలేదని తెలిపారు.ప్రస్తుతం బుడమేరు గండ్లును పూడ్చడమే తమ లక్ష్యమని...అదే పనిలో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
వరద బాధితుల సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏమాత్రం సహించేది లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. బాధితులకు మూడు పూటలా ఆహారం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. చిట్ట చివరి బాధితుడికి కూడా సాయం అందాలని స్పష్టం చేశారు.
భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం అర్థరాత్రి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షించారు.ముంపు ప్రాంతాల్లో బోటులో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పెనుప్రమాదం తప్పింది. ఆయన పర్యటిస్తున్న బోటు ఒక్కసారిగా పక్కకి ఒరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది..బోటును తిరిగి యథాస్థితికి తీసుకుని వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో 12 పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తుంటే అందులో ఏపీలో మూడు కారిడార్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మూడు కారిడార్ల పై 28 వేల కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఆడ బిడ్డల జోలికి వస్తే..అదే వారికి చివరి రోజు అనే విషయం నేరస్తులకు అర్ధం కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.నేరం చేస్తే శిక్ష తప్పదు అనే భయం తప్పు చేసేవారిలో కనిపించేలా పోలీసు శాఖ పని చేయాలన్నారు.