BREAKING: ఏపీ ఎన్నికలపై ఈసీ కీలక ఆదేశాలు
ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు ఈసీ బృందం అధికారులు ఏపీలో పర్యటించనున్నారు.
ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు ఈసీ బృందం అధికారులు ఏపీలో పర్యటించనున్నారు.
తెలంగాణలో మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడంపై కర్ణాటక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక రాష్ట్ర సీఎస్ కు నోటీసులు జారీ చేసింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది ఎన్నికల కమిషన్. టీ-హబ్లో నిరుద్యోగులతో కేటీఆర్ సమావేశంపై ఈసీ సీరియస్ అయింది. రేపు సాయంత్రం 3 గంటలలోపు నోటీసులకు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీలకు నోటీసులు ఇచ్చింది. తమకు వచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్స్ వివరాలు అందించాలని నోటీసుల్లో పేర్కొంది. రేపు సాయంత్రం 5గంటల వరకు వివరాలు అందించాలని ఆదేశించింది.
తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం తన పార్టీకు గుర్తు కేటాయించడం లేదని ఆరోపించారు ప్రజాశాంతి పార్టీ అధినేత KA పాల్. నామినేషన్ వేసేందుకు తన మరో రెండు రోజుల సమయం కావాలని ఈసీని డిమాండ్ చేశారు.
ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకే కీలక సూచనలు చేసింది ఎన్నికల సంఘం. ఒక్కొక్క అభ్యర్థి గరిష్టంగా రూ. 40 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. అదనంగా ఖర్చు చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని.. సెక్షన్ 123(6) ప్రకారం అవినీతికి పాల్పడినట్లు కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించింది.
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర తుదిఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 1,58,71,493గా ఉంది. మహిళా ఓటర్ల సంఖ్య 1,58,43,339 కాగా ట్రాన్స్ జండర్ ఓటర్లు 2557 మంది ఉన్నారు.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటినవారు ఇంటి నుంచే ఓటుహక్కు వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ సదుపాయాన్ని కోరుకున్న వారికి ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగానికి అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 27 ఖమ్మం రానున్న ఆయన.. అక్కడ జరిగే భారీ బహరింగ సభలో పాల్గొననున్నారు. ఆ సభనుంచే ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమావేశమైన కేంద్ర ఎన్నికల కమిటీ తెలంగాణలో మరో విడత సర్వే చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.