khalisthan:భారత్ తో పెట్టుకుంటే దెబ్బ మామూలుగా ఉండదు...
ఖలీస్థాన్ వేర్పాటువాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ ఛీఫ్ గురపత్వంత్ సింగ్ పన్నున్ కు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇండియాలో అతని ఆస్తులను జప్తు చేసింది.
ఖలీస్థాన్ వేర్పాటువాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ ఛీఫ్ గురపత్వంత్ సింగ్ పన్నున్ కు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇండియాలో అతని ఆస్తులను జప్తు చేసింది.
దీంతో ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య వ్యాపార సంబంధాలు కూడా ఇరుకున పడ్డాయి. వచ్చే నెలలో రెండు దేశాల మధ్య జరగాల్సిన ట్రేడ్ మిషన్ కూడా వాయిదా వేస్తున్నట్లు కెనడా వాణిజ్య శాఖ మంత్రి తెలిపారు. ఎటువంటి కారణాలు తెలియజేయకుండానే ఈ చర్చల్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
కెనడా-భారత్ ల మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోందే తప్ప ఎక్కడా తగ్గే సూచనలు కనిపించడం లేదు. తాజాగా భారత్-కెనడా దేశాల మధ్య వీసా ఆపరేషన్స్ ను నిలిపేస్తున్నామని భారత్ ప్రకటించింది.
ఖలిస్తానీ ఉద్యమంలో కీలకమైన మరో గ్యాంగ్ స్టర్ కెనడాలో హత్య గురైనట్లు సమాచారం. ప్రత్యర్ధుల దాడిలో ఇతను మరణించాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. చనిపోయిన అతను పంజాబ్ కు చెందిన సుఖా దునెకే గా గుర్తించారు.
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను భారత్ హతమార్చిందని కెనడా ఆరోపిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ విషం చిమ్మింది. భారత్‌ను విమర్శించే సాకుతో పాక్ పీఓకే, బాలాకోట్‌లలో సర్జికల్ స్ట్రైక్స్ గురించి తెరపైకి తెచ్చింది. కెనడా ఆరోపణలకు పాకిస్థాన్ మద్దతు తెలిపింది.
కెనడాతో వివాదంలో తొలిసారిగా బద్ధ శత్రువైన చైనా భారత్‌కు అండగా నిలిచింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్‌పై జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను పాశ్చాత్య కూటమి ఎజెండాగా చైనా అభివర్ణించింది. భారత్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ఇది ఒత్తిడి వ్యూహంగా అభివర్ణించారు. అటు కెనడాతో సహా పాశ్చాత్య దేశాలై గ్లోబల్ టైమ్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కెనడా- భారత్‌ల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కెనడాలో ఉన్న భారతీయులు, భారత్‌కు చెందిన విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కెనడా భారత్‌తో సత్సంబంధాలను చెడగొట్టుకుంది. ఖలిస్థాన్ ఉగ్రవాదిని హతమార్చడం వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది. అలాంటి ఆరోపణలను భారత్ ఖండించింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. ఇండియా పరువు తీసేందుకు కెనడా చాలానే ప్రయత్నాలు చేసింది. కానీ అగ్రదేశాలైన అమెరికా, బ్రిటన్ కెనడాకు సపోర్టు చేయలేదు. భారత్ విషయంలో కెనడా వైఖరి తప్పని చెప్పకనే చెప్పాయి. భారత్ పరువు తీయాలనుకున్న కెనడా తన పరువు తానే తీసుకున్నట్లయ్యింది.