Bus Accident: 200 అడుగుల లోతు లోయలో పడిన బస్సు!
జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో శనివారం ఓ బస్సు రోడ్డు పై నుంచి జారి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో శనివారం ఓ బస్సు రోడ్డు పై నుంచి జారి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
సిమ్లాలోని జుబ్బల్ లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జుబ్బల్ లోని గిల్తాడి రోడ్డు పై హెచ్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం నలుగురు అక్కడికక్కడే మృతి చెండగా... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా ఉన్నారు.
తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయని వస్తున్న ప్రచారాలను టీజీఎస్ఆర్టీసీ ఖండించింది. కేంద్రం టోల్ఛార్జీలు పెంచడంతో టికెట్లో టోల్సెస్ను మాత్రమే సవరించామని.. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.
నరాసరావుపేట మండలం పెట్లూరివారి పాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద అడ్డంగా పడిన చెట్టును తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా...మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం అయ్యసాగర్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.కారు, బస్సు ఎదురెదురుగా వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది.
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.బాపట్ల జిల్లా చిన గంజాం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ను అతి వేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు.
ముంబై-ఆగ్రా హైవేపై రాష్ట్ర రవాణా బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనీసం 5 మంది మరణించారు. 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు వృద్దులు, 14 ఏళ్ల బాలుడు, ఇద్దరు పురుషులు, బస్సు కండక్టర్ ఉన్నారు.
రైతు బాసటగా కేసీఆర్ మరో ఉద్యమానికి బయలుదేరారు. ఇందులో భాగంగా జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనకు బయలు దేరిన కేసీఆర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. మొండ్రాయి చెక్ పోస్ట్ దగ్గర ఆయన వెళుతున్న బస్సును ఆపి తనిఖీలు నిర్వహించారు.