MLC Kavitha: ఇంటి భోజనం ఇవ్వట్లేదు.. కోర్టులో కవిత పిటిషన్!
తనకు జైలులో తినడానికి ఇంటి భోజనం అనుమతించడం లేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు.
తనకు జైలులో తినడానికి ఇంటి భోజనం అనుమతించడం లేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కే కేశవరావు ఈ నెల 30న కాంగ్రెస్ లో చేరడం కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ను ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ కు వెళ్లి కలిసిన కేకే పార్టీ మారే విషయాన్ని చెప్పినట్లు సమాచారం. కేకేతో పాటు ఆయన కూతురు విజయలక్ష్మి కూడా పార్టీ మారే అవకాశం ఉంది.
TS: నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. రేవంత్ కూడా సీఎం పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. మల్కాజ్గిరి ఎంపీగా ఉండి రేవంత్ ఒక్క పని చేయలేదని.. ఓటమి భయంతోనే తన సవాల్‌ను రేవంత్ స్వీకరించడం లేదని అన్నారు.
నిన్న కోర్టు ఆర్డర్ తర్వాత ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించారు. అక్కడ ఆమెకు ఖైదీ నంబర్ 666 ను కేటాయించారు. అయితే మొదటి రోజు జైల్లో కవిత చాలా డల్‌గా ఉన్నారని తెలిసింది.
దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడంపై విమర్శలు గుప్పించారు కేటీఆర్. దానం అవకాశవాది అని అన్నారు. బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి దానం వెళ్లారని పేర్కొన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలు ఉంటాయని అన్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఖతమై పోతారని తెలిపారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక గోవాకు చేరుకున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల క్యాంపులతో గోవా నిండిపోయింది. ఓటర్లుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉండడంతో వారిని కాపాడుకునేందుకు ఇరు పార్టీల పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు.
అధికారంలోకి రాగానే రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని.. రైతులెవరూ ఇప్పుడు బ్యాంకులకు అప్పులు కట్టోద్దు అని హరీష్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో 180 రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు.
పెండింగ్ లో ఉన్న హైదరాబాద్ లోక్ సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను ఆ పార్టీ అధినేత ఖరారు చేశారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. దీంతో ప్రచారం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది.
బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్గా మారబోతుందా అనే దానిపై బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మార్చడం తమ పార్టీ క్యాడర్ లో 80 శాతం మందికి ఇష్టం లేదని అన్నారు.