Fireworks Burst : బాణసంచా పేలుడుతో ఏడుగురికి తీవ్రగాయాలు!
అమలాపురం రావుల చెరువులోని బాణసంచా కేంద్రం సోమవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అమలాపురం రావుల చెరువులోని బాణసంచా కేంద్రం సోమవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో రియాక్టర్ పేలిన ఘటన లో చనిపోయిన వారి సంఖ్య 18కి చేరుకుంది. పేలుడు ధాటికి గోడ, మొదటి అంతస్తు శ్లాబ్ కూలడంతో శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కార్మికులు ఉండిపోయినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
శ్రీరామ నవమి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో సైకత్పురాలో బ్లాస్ట్ జరిగింది. శ్రీరామ నవమి ఉరేగింపులో ఇది చోటు చేసుకోవడంతో అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఈ ప్రమాదంలో ఒక మహిళకు తీవ్రగాయాలయ్యాయి.
మధ్యప్రదేశ్లోని హర్దాలో బాణసంచా ఫ్యాక్టరీలో మంగళవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలో ఒకదాని తర్వాత ఒకటి పేలుళ్లు జరగడం ప్రారంభించాయి.ఈ దారుణ ఘటనలో ఆరుగురు సజీవ దహనం అయినట్లు అధికారులు నిర్థారించారు.
హైదరాబాద్ శివారులో రాజేంద్రనగర్లో ఘోర ప్రమాదం జరిగింది. బేకరీలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.