BJP : రెండు రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ జాతీయ మహా సభలు!
ఢిల్లీలో బీజేపీ రెండు రోజుల జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరగనున్న బీజేపీ జాతీయ మహాసభల్లో దేశవ్యాప్తంగా 11,500 మంది ప్రతినిధులు పాల్గొంటారు.
ఢిల్లీలో బీజేపీ రెండు రోజుల జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరగనున్న బీజేపీ జాతీయ మహాసభల్లో దేశవ్యాప్తంగా 11,500 మంది ప్రతినిధులు పాల్గొంటారు.
ఏపీలో పొత్తుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఇదే విషయంపై హైకమాండ్‌తో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఒకవేళ పొత్తు ఉంటే ఏపీలో బీజేపీకి 10 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్ల ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.
బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే.. ప్రాంతీయ పార్టీల అస్థిత్వానికి ముప్పు ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. ఈ నేపథ్యంలోనే మిగిలిన పార్టీలు.. ఇండియా బ్లాక్‌లో ఉండాలని తాను కోరుతున్నట్లు చెప్పారు.
రైతులకు మేలు చేసే పథకాలపై తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. గతంలో రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇచ్చేవి కాదన్నారు. రైతులు ఆందోళన చేస్తున్న వేళ.. ప్రధాని మోదీ ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమవుతోంది.
శుక్రవారం రైతు సంఘాలతో కేంద్రమంతులు జరిపిన చర్చలు మూడోసారి విఫలమయ్యాయి. ఫిబ్రవరి 18న మరోసారి చర్చలు జరిపేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి. అయితే తమపై బలప్రయోగం చేస్తే ఊరుకునేది లేదంటూ రైతు సంఘాలు హెచ్చరించాయి.
మరోసారి బలపరీక్షకు సిద్ధమయ్యారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. రేపు అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది మార్చిలో కూడా విశ్వాస తీర్మానం పెట్టి తన మెజార్టీ నిరూపించుకున్న కేజ్రీవాల్.. మరో బలపరీక్షకు సిద్ధం కావడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
లోక్‌సభ ఎన్నికల దగ్గరికొస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖాతాలు ఫ్రీజ్ కావడం కలకలం రేపింది. పన్ను చెల్లించలేదనే కారణంతో ఐటీ శాఖ తమ అకౌంట్లు నిలిపివేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ ప్రకటన చేసిన గంట తర్వాత ఖాతాలను మళ్లీ పునరుద్దరించారు.
వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. అందుకే పొరుగు రాష్ట్రాల జనానికి కూడా ఏపీలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తుందని ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పోటీ చేసేందుకు వైసీపీనుంచి ఎవరూ ముందుకు రావట్లేదని విమర్శలు చేశారు.
రాజకీయ పార్టీలకు విరాళంగా వచ్చే ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమైనవని.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఎన్నికల బాండ్లను మోదీ ప్రభుత్వం కమీషన్లుగా మార్చేసిందని.. ఇది కోర్టులో రుజువైందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.