Ayodhya Mandhir: రాత్రి సమయంలో అయోధ్య రామ మందిర అందాలు చూడతరమా!
అయోధ్య రామ మందిరం రాత్రి పూట చిత్రాలను ఆలయ ట్రస్ట్ విడుదల చేసింది. నైట్ వ్యూ లో మందిరం ఎలా ఉందో మీరు కూడా చూసేయండి మరీ..
అయోధ్య రామ మందిరం రాత్రి పూట చిత్రాలను ఆలయ ట్రస్ట్ విడుదల చేసింది. నైట్ వ్యూ లో మందిరం ఎలా ఉందో మీరు కూడా చూసేయండి మరీ..
జనవరి 22న అయోధ్యలో జరిగే రాముల వారి ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్కు చెందిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి(64) రూ.64 లక్షల విలువైన బంగారు పూత పూసిన చెప్పులు ధరించి అయోధ్యకు 8,000 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్తున్నారు.
యూపీలో రామమందిర ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగే జనవరి 22 నే చాలా మంది గర్భిణులు తమ బిడ్డలకు జన్మనివ్వాలనుకుంటున్నారని అక్కడి వైద్యులు తెలిపారు. చాలా మంది సీ సెక్షన్ చేయాలని, మరి కొందరు నెలలు నిండకుండానే ప్రసవం చేయాలని వైద్యులను కోరుతున్నారని సమాచారం.
ఈ నెల 22 న జరగనున్న అయోధ్యరామ మందిర ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఆహ్వానం అందింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు రజనీకాంత్ ను స్వయంగా కలిసి ఆహ్వానించారు. దీంతో ఈ వేడుకకు రజనీతో పాటు ఆయన సతీమణి, సోదరుడు హాజరుకానున్నట్లు సమాచారం.
అయోధ్యాపురిలో కొలువుదీరనున్న రామయ్యను దర్శించుకునేందుకు వెళ్తున్నారా? అయితే మీకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్యలో పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని వితరణ చేసేందుకు టీటీడీ సిద్ధమయ్యింది. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా తిరుమల లడ్డూలను పంపనున్నట్లు ఈవో తెలిపారు.
జనవరి 22న అయోధ్యలో జరిగే మహత్తర రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి, తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున లక్ష లడ్డూలను కానుకగా పంపుతున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒక్కో లడ్డూ 25 గ్రాముల బరువు ఉంటుందని ఆయన వివరించారు.
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు ఇప్పటికే సిద్ధమయ్యారు. అయోధ్య రామమందిరాన్ని సందర్శించేటప్పుడు మనం ఏ ఆలయాలను సందర్శించవచ్చు? వివరాల కోసం ఈ స్టోరీలోకి వెళ్లండి.
తన నాథుని రాక కోసం అయోధ్య నగరం ముస్తాబవుతోంది. జనవరి 22న శ్రీరామ మందిరంలో రాంలల్లాను ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీవీఐపీలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ ఆహ్వాన పత్రిక శ్రీరాముని రాకకు సంబంధించిన ఈ ప్రత్యేక దినాన్ని మరింత దివ్యంగా మారుస్తోంది.
అయోధ్యాపురి రామాలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వెయ్యేళ్లవరకు చెక్కుచెదరదు. తూర్పు-పడమర పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. ప్రతి అంతస్తులో ఆలయం 20 అడుగుల ఎత్తులో ఉంది. దీనికి 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి.