Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్ష కోసం మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 19 వరకు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్డడీని పొడిగించింది.
మధ్యంతర బెయిల్ పొడిగించాలన్న కేజ్రీవాల్ పిటిషన్‌పై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్టైన సంగతి తెలిసిందే. మే 11న మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా, రేపటితో కేజ్రీవాల్ బెయిల్ గడువు ముగియనుంది.
జూన్ 2వ తేదీన ఈడీ ఎదుట తాను సరెండర్ అవుతానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఒకవేళ దేశం కోసం తాను చనిపోతే..ఎవరూ బాధపడొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 రోజుల పాటు జైల్లో ఉండడం వల్ల తన ఆరోగ్యం క్షీణించిందన్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు తాను జైల్లో ఉన్నట్లైతే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఢిల్లీలో ఉన్న మొత్తం 70 స్థానాల్లో గెలుస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తమ ఎమ్మెల్యేలను జైల్లో పెట్టి ఎన్నికలు జరపాలని కేంద్రానికి సవాలు చేశారు.
ఇటీవల ఢిల్లీలోని మెట్రో స్టేషన్ గోడలపై కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు రాతలు రాసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని అంకిత్ గోయల్(33) గా గుర్తించారు. అతనికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు.
అమిత్ షాపై నిప్పులు చెరిగారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో అమిత్ షా చేసిన ర్యాలీకి 500 మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఆప్ మద్దతు దారులను అమిత్ పాకిస్థానీలు అంటున్నారని ఫైర్ అయ్యారు. అమిత్ షా ప్రధాని అవుతున్నారని అహంకారం పెరిగిందని విమర్శించారు.
ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఈ రోజు ఢిల్లీ పోలీసుల బృందం సోదాలు నిర్వహించింది. ల్యాప్‌టాప్ & సీసీటీవీ డీవీఆర్ స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు కొన్ని కీలక పత్రాలను కేజ్రీవాల్ నివాసం నుంచి తీసుకెళ్లారు.