AP Metro MD: ఏపీ మెట్రో రైల్ ఎండీగా రామకృష్ణారెడ్డి నియమకం
చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మెట్రో రైల్ ఎండీగా రామకృష్ణారెడ్డిని నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మెట్రో రైల్ ఎండీగా రామకృష్ణారెడ్డిని నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చామన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి. లబ్ధిదారులకు సామాజిక భద్రతా పించన్లు రూ.4000 పంపిణీ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీలను నెరవేరుస్తుందని కామెంట్స్ చేశారు.
నిండు కుండలా మారిన శ్రీశైలం జలాశయం వద్ద నేడు కృష్ణమ్మ తల్లికి ఏపీ సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, బీ సీ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
AP: అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్ లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడానని తెలిపారు.
గుంటూరులోని జీడీసీసీ బ్యాంకులో ఒక్కొక్కటిగా భారీ కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకులో రుణాల పేరుతో కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. రైతులు కాని వారి ఆధార్ కార్డులు సేకరించి, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి బ్యాంకు సొమ్మును మింగేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
AP: ఈరోజు కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖలపై అధికారులతో సమీక్షించనున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనపై సమీక్ష చేయనున్నారు.
తన కొడుకుని స్నేహితులే చంపి రోడ్డుపై పడేస్తే పోలీసులు పట్టించుకోలేదని ఓ మహిళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ప్రజలను కలిసి వారి సమస్యలను నేరుగా విన్నారు. పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
మదనపల్లె ఫైల్స్ దగ్ధం ఘటనపై సర్కార్ సీరియస్ అయింది. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేసింది. గత RDO మురళి, ప్రస్తుత RDOగా పని చేస్తున్న హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌ను సస్పెండ్ చేస్తూ రెవిన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ సచివాలయ, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 16 శాతం హెచ్ఆర్ఏను 24శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రూ.25 వేలకు మించకుండా వర్తింపజేయాలని ఆర్థికశాఖ కార్యదర్శి అధికారులకు సూచించారు.