విశాఖ - తిరుపతి రైలులో పొగలు..టపాసుల కలకలం!
విశాఖ-తిరుపతి ఎక్స్ప్రెస్లో బాణసంచా కలకలం సృష్టించింది. తుని స్టేషన్లో రైలు ఆగిన సమయంలో ఎస్3 బోగీలో బాణసంచా పేలి పొగలు వచ్చాయి.
విశాఖ-తిరుపతి ఎక్స్ప్రెస్లో బాణసంచా కలకలం సృష్టించింది. తుని స్టేషన్లో రైలు ఆగిన సమయంలో ఎస్3 బోగీలో బాణసంచా పేలి పొగలు వచ్చాయి.
దేవరగట్టు మరొకసారి మారుమోగింది. తరతరాలుగా వస్తున్న కర్రల సమరంతో ఆ ప్రదేశం రణరంగంగా మారింది. భక్తిభావంతో చేసిన ఈ కర్రల ఫైట్ లో 100 మందికి పైగా గాయపడ్డారు. చెట్టు కొమ్మ విరిగి ఒక యువకుడు మరణించాడు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
కడప నగరంలో గత రెండు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. బూశెట్టి జ్యూవెలర్స్ నుంచి సుమారు 200 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. బూశెట్టి షాపుతో లావాదేవీలు ఉన్నందున ఐటీ దాడులు తప్పించుకునేందుకు దుకాణాలను వ్యాపారస్తులు మూసి వేశారు .
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు శ్రీలక్ష్మీ గణపతి దేవాలయం అంటే ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వామి వారికి మన కోరికలు చెవిలో చెబితే చాలు ఆయన వాటిని విని వెంటనే తీరుస్తాడని ఓ నమ్మకం.
నాలుగేళ్ళుగా కామ్ గా ఉన్న జగన్ ఒక్కసారిగా జూలు విదిల్చారు. ఇన్నాళ్ళు కేవలం మాటలతో, కేసులతో భయపెట్టారు. కానీ ఇప్పుడు ఏకంగా జైల్లోకి నెట్టారు. ఇలాగే ఒక దాని మీద మరొక కేసు పెట్టి కరెక్ట్ గా ఎన్నికల టైమ్ కి కేసులతో టీడీపీ చతికిలపడేలా చేయాలన్నది వైసీపీ వ్యూహం.
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. సీబీఐ నుంచి తప్పుకున్న తరువాత ఆయన చూపు రాజకీయాల మీద పడింది. ఈ క్రమంలోనే ఆయన జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచనల మేరకు ఆయన విశాఖ పట్నం నుంచి పోటీ చేశారు.
ఏపీ విభజన బిల్లు పై విచారించే క్రమంలో సుప్రీం కోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం గురించి పిటిషనర్ ను ఇది ఎవరికి సంబంధించిన విషయం అంటూ ప్రశ్నలు సంధించింది.