Andhra Pradesh : నేటి నుంచే వైసీపీ ఎన్నికల శంఖారావం
ఆంధ్రాలో ఎన్నికల ప్రచారానికి వైసీపీ తెర తీసింది. ఈరోజు నుంచే ఆ పార్టీ ఎన్నికల శంఖారావం మోగనుంది. కడపలోని ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది.
ఆంధ్రాలో ఎన్నికల ప్రచారానికి వైసీపీ తెర తీసింది. ఈరోజు నుంచే ఆ పార్టీ ఎన్నికల శంఖారావం మోగనుంది. కడపలోని ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది.
74 తులాల బంగారం చోరీ చేసిన తెలుగు నటి సౌమ్య శెట్టి.. అంటూ వరుస బ్రేకింగ్‌లు గత కొన్నిరోజులుగా హాట్ టాపిక్ అవుతున్నాయి. విశాఖలో సంచలనంగా మారిన ఈ కేసులో నిందితురాలు సౌమ్య ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చింది. రివర్స్ కంప్లైంట్‌తో అందరికీ షాక్ ఇచ్చింది.
ఏపీలో పొలిటికల్ హీట్ రానురాను పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇద్దరు నేతలూ రాయలసీమలోని తమ సొంత నియోజకవర్గాల నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు.
నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి చెక్కులు పంపిణీ చేశారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో ఎన్నికలను బహిష్కరించండంటూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) లేఖను విడుదల చేసింది. పార్టీలను తన్ని తరమాలని పిలుపునిచ్చారు. బీజేపీ, టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు దోపిడీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని ఆరోపించారు.
ఏపీలో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. మత్స్యకారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఎంపీ సీటు కోసం బీజేపీ అభ్యర్ధుల మీద తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఇక్కడ నుంచి పోటీ చేయాలని పురందేశ్వరి, జివిఎల్ నరసింహారావు ఇద్దరు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
భారత్ లో 18 వ లోక్ సభ ఎన్నికల సందడి షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచే ప్రారంభమైంది. ఈ ఎన్నికలకు సంబంధించిన తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం వెలువడనుంది. మొదటి షెడ్యూల్ లో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోసం వైసీపీ ప్రభుత్వం సిద్ధం అయింది. ఇప్పటికే తన పార్టీ తరుఫున 175 మంది అభ్యర్ధులను ప్రకటించిన పార్టీ ఇప్పుడు ప్రచారానికి రెడీ అయింది. మేమంతా సిద్ధం పేరుతో ప్రచారంలోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు సీఎం జగన్.