AP : తిరుమల బయలు దేరిన అమరావతి రైతులు.!
తుళ్ళూరు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం బయలు దేరారు 120 మంది అమరావతి రైతులు. తుళ్ళూరు లోని శివాలయం, సాయిబాబా, అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరుపతి బయలుదేరారు.
తుళ్ళూరు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం బయలు దేరారు 120 మంది అమరావతి రైతులు. తుళ్ళూరు లోని శివాలయం, సాయిబాబా, అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరుపతి బయలుదేరారు.
వైఎస్సాఆర్ కడప జిల్లా కమలాపురం ఏఎస్సైగా గా పని చేస్తున్న నాగార్జున రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం రాత్రి ఆయన విధులు ముగించుకుని బుధవారం ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఆర్టికల్‌ను చదవండి.
ఏపీ విభజన జరిగి 2024 జులై 2 నాటికి పదేళ్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య విభజన అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. 9వ, 10వ షెడ్యూల్లో అనేక అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అల్లూరి జిల్లా పోచమ్మ గండి వద్ద పాపికొండల పర్యాటక బోట్లను టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. పాపికొండలు వెళ్లి వచ్చిన పర్యాటకులతో బోట్ లో సమస్యలు అడిగి తెలుకున్నారు. బోట్ భద్రత దృష్ట్యా అధికారులతో కలిసి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక నుంచి తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో జే శ్యామలరావు అధికారులను ఆదేశించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని, వాటిపై చర్చిద్దామని ఆహ్వానించారు. జులై 6 సాయంత్రం వీటిని చర్చించడానికి కలుద్దామని చెప్పారు.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి సర్కార్ అభ్యర్థులు ఖరారు చేసింది. టీడీపీ నుంచి సి.రామచంద్రయ్య, జనసేన నుంచి పిడుగు హరిప్రసాద్ పేర్లు ఫైనల్ చేశారు. మంగళవారం వీరిద్దరూ నామినేషన్ వేయనున్నారు.
ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ అందరూ ప్రజలకు సేవకులగా ఉంటారని, తాము పెత్తందారులం కాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.