BIG BREAKING : సుజనా చౌదరికి తీవ్ర గాయం..హైదరాబాద్‌కు తరలింపు!
ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయం అయింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడున్న ఓ సూపర్ మార్కెట్ లో కిందపడిపోయారు. దీంతో ఆయన కుడి భుజం ఎముక విరిగిపోయింది.
ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయం అయింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడున్న ఓ సూపర్ మార్కెట్ లో కిందపడిపోయారు. దీంతో ఆయన కుడి భుజం ఎముక విరిగిపోయింది.
ఏపీలో పది రోజుల పాటు మిట్ట మధ్యాహ్నం నీడ మాయం కానుంది. దీన్నే జీరో షాడో అంటారు. నేటి నుంచి 14వ తేదీ వరకు ఏపీలో మిట్ట మధ్యాహ్నం కూడా రెండు నిమిషాలు పాటు నీడ మాయమైపోతుంది. ఈ విషయాన్ని జాతీయ కన్వీనర్ మేకా సుసత్య రేఖ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో పశ్చిమగోదావరి, ఏలూరుతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో సిరిసిల్ల, కరీంనగర్, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఓ నాలుగేళ్ల బాలుడిని వీధికుక్కలు చుట్టుముట్టి కరవడంతో స్పాట్ లోనే చనిపోయాడు. మొహిద్దీన్(4) శుక్రవారం సాయంత్రం ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా వీధికుక్కలు అటాక్ చేయడంతో స్పాట్ లోనే చనిపోయాడు.
ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ వేదికకు సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ సభకు సరిగ్గా 5కిలో మీటర్ల దూరంలో మంటలు ఎగసిపడ్డాయి. ఎల్ అండ్ టీ కంపెనీ పైపులకు నిప్పు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డి పీఏ పైలా దిలీప్‌ను అరెస్ట్ అయ్యారు. చెన్నై ఎయిర్‌పోర్టులో సిట్ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో సమావేశమయ్యారు. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు, న్యాయశాఖలో ఖాళీలను భర్తీ చేయడం వంటి ముఖ్యమైన డిమాండ్లు అందులో ఉన్నాయి.
నటి శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. ప్రతిపక్షంలో ఉండగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు చేశారంటూ శ్రీరెడ్డిపై టీడీపీ మహిళ నేతలు కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేశారు.
ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.