అనంతపురంలో.. దొంగల బీభత్సం | Robberies in Ananta puram | RTV
Anantha puram Rural Police arrests the accused called Agraharam Ranga Swami as they suspect him for earlier Robberies in Ananta Puram and surrounding Areas | RTV
Anantha puram Rural Police arrests the accused called Agraharam Ranga Swami as they suspect him for earlier Robberies in Ananta Puram and surrounding Areas | RTV
అనంతపురం జిల్లా గొల్లల దొడ్డి గ్రామంలోని చతుర్ముఖ ఆలయంలో దుండగులు విధ్వంసం సృష్టించారు. పడమర నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఘటనపై పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేపాల్ తర్వాత చెప్పుకోదగ్గ పశుపతినాథ ఆలయంలో ఇలా జరగడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.
ధర్మవరంలో మాంగల్య షోరూంను కచ్చితంగా మూసివేయాల్సిందేనని పట్టుచీరల తయారీ వ్యాపారస్తుల సంస్థ ప్రెసిడెంట్ గిర్రాజు రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు ధర్మవరం పట్టణంలోని వ్యాపారస్తులతో కలిసి ఆయన ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
అనంతపురం జిల్లా సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. గతంలో జడ్పీటీసీ లకు డిప్యూటీ సీఈవో గౌరవం ఇవ్వకుండా అవమానం చేశారని.. డిప్యూటీ సీఈవో పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
అనంతపురంలో అనావృష్టి వల్ల తీవ్రంగా నష్టపోయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయమన్నారు. పంట రుణాలు చెల్లించమని అధికారులు ఒత్తడి చేస్తున్నారని ఇప్పటికే 250మందికి పైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు.