BIG BREAKING: ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఖతం!
సుదీర్ఘంగా జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందినట్లుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.
సుదీర్ఘంగా జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందినట్లుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు.