Chandanagar:హైదరాబాద్‌లో స్విగ్గి డెలివరీ బాయ్ మృతి.. అసలేం జరిగిందంటే..? చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనుమానాస్పదంగా స్విగ్గి డెలివరీ బాయ్ మూర్తి మరణించాడు. చనిపోయిన వ్యక్తి లింగంపల్లికి చెందిన అనిల్‌గా చందానగర్ పోలీసులు గుర్తించారు. By Vijaya Nimma 22 Sep 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి హైదరాబాద్‌లోని చందానగర్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. వెరిటేక్స్ విల్లా నిర్మాణాల్లో స్విగ్గీ డెలివరీ బాయ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఘటనతో చందానగర్ ప్రాతంలో కలకలం రేపుతోంది. జహీరాబాద్ జిల్లాకు చెందిన అనిల్ లింగంపల్లిలో నివాసం ఉంటున్నాడు. స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఉదయం తన బైక్‌పై స్విగ్గీ డెలివరీ కోసం బయలుదేరిన అనిల్.. నల్లగండ్ల వెరిటేక్స్ విల్లా నిర్మాణాల్లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ దగ్గర మృతి చెందాడు. Your browser does not support the video tag. శరీరంపై తీవ్ర గాయాలు అనిల్ మృతదేహాన్ని చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కరెంట్ షాక్ తగిలి అనిల్ మృతి చేందినట్లు అనుమానించారు. అనిల్ ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు అనిల్ కుమార్ వయసు 35 సంవత్సరాలు ఉన్నాయి. అనిల్ శరీరంపై తీవ్ర గాయాలు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గత రెండు నెలల క్రితం గతంలో కూడా కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మే నెలలో అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసింది. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న స్విగ్గీ డెలివరీ బాయ్ రాజు(30), మరో వ్యక్తి రాజ్‌కుమార్(29)ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో డెలివరీ బాయ్ రాజును అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. దయనీయ స్థితిలో కన్నుమూశాడు బేగంపేట్ స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి దయనీయ స్థితిలో కన్నుమూశాడు. గోపాలన శ్రీనివాస్ ఓ బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ స్విగ్గీ డెలివరీ బాయ్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే విధులు ముగించుకుని హాస్టల్‌కు వెళ్లిన గోపాలన్ భోజనం చేసి గదిలోకి వెళ్లి మళ్లీ బయటకు రాలేదు. హాస్టల్ నుంచి దుర్వాసన రావటంతో చుట్టుపక్కల ప్రజలు హాస్టల్ యజమానికి ఫిర్యాదు చేశారు. నిర్వాహకులు అన్ని గదులు తనిఖీ చేయగా.. గోపాలన్ గది నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో లోపలికి వెళ్లి చూడగా అతను మరణించి ఉన్నాడు. హాస్టల్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గోపాలన్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇలా వరసగా హైదరాబాద్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్ మరణించటం ఆందోళన కారంగా మారింది. #hyderabad #police-station #chandanagar #swiggy-delivery-boy-died మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి