Kanguva : సూర్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'కంగువ' రిలీజ్ డేట్ వచ్చేసింది..! సూర్య 'కంగువ' మూవీ దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని 2024 అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇందులో సూర్య వారియర్ గా కత్తి పట్టుకున్న లుక్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది. By Anil Kumar 28 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Suriya Kanguva Movie Release Date Out : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ కంగువా. తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సూర్య లుక్, టీజర్ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేశాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సూర్య ఐదు విభిన్న తరహా పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం వల్ల వాయిదా పడింది. సూర్య ఫ్యాన్స్ ఈ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మేకర్స్ రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇచ్చారు. Also Read : ‘కల్కి’ తెచ్చిన తంటా.. కర్ణుడు Vs అర్జునుడు సోషల్ మీడియాలో మొదలైన ఫ్యాన్ వార్! దసరా కానుకగా... 'కంగువ' దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని 2024 అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇందులో సూర్య వారియర్ గా కత్తి పట్టుకున్న లుక్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది. పోస్టర్ చూస్తుంటే సినిమాలో సూర్య రోల్ అతని కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచే ఛాన్స్ ఉంది. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ 38 భాషల్లో విడుదల కానుంది. Ready yourselves to welcome the Warrior King 👑 Our #Kanguva is set to conquer your hearts and screens from October 10, 2024 🗡️🏹#KanguvaFromOct10 🦅@Suriya_offl @DishPatani @thedeol @directorsiva @ThisIsDSP #StudioGreen @GnanavelrajaKe @vetrivisuals @supremesundar… pic.twitter.com/tyLEmftbZl — Studio Green (@StudioGreen2) June 27, 2024 #kanguva-movie #suriya #kanguva-movie-release-date మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి