Supreme Court: జగన్ కు సుప్రీం షాక్.. అక్రమాస్తుల కేసులో నోటీసులు.!

సుప్రీంకోర్టులో జగన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసులో జగన్‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది.

New Update
Supreme Court: జగన్ కు సుప్రీం షాక్.. అక్రమాస్తుల కేసులో నోటీసులు.!

Supreme Court: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి సుప్రంకోర్టులో గట్టి షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో జగన్‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. జగన్‌తో పాటు సీబీఐకి (CBI) కూడా ఉన్నతన్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. జగన్ కేసులకు సంబంధించి దాఖలైన పిటీషన్‌పై ఈరోజు సుప్రీంలో విచారణ జరిగింది.

Also Read: ఏపీలో ఈ నెల 15 నుంచి కుల గణన.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతోందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు కేసు విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్ లో కోరారు. తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విపరీతమైన జాప్యం జరుగుతోందని.. 3071 సార్లు జగన్ కేసును సీబీఐ కోర్టు వాయిదా వేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్ ప్రత్యక్ష హాజరుకు కూడా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందన్నారు. వందల కొద్ది డిశ్చార్జి పిటీషన్లు వేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.  ఈ పిటిషన్ ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎన్వీఎన్ భట్టిల ధర్మాసనం విచారించింది.

అయితే రఘురామ పిటిషన్‌పై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. జగన్ అక్రమాస్తుల కేసుకు ఎంపీ రఘురామకు సంబంధం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. ఎంపీ రఘురామ ఫిర్యాదుదారు కాదని.. బాధితుడు కూడా కానప్పుడు ఆయనెందుకు పిటీషన్ వేశారని అడిగింది. కాగా, ఫిర్యాదుదారు కానప్పటికీ పిటీషన్ దాఖలు చేయవచ్చని ఎంపీ రఘురామ తరపు సీనియర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, మూడో వ్యక్తి ఎందుకు పిటిషన్ వేశారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా అని కోర్టు అడుగగా.. ఎంపీ రఘురామ కూడా వైసీపీ ఎంపీనే అని ఎంపీ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఇందులో భాగంగా జగన్ అక్రమాస్తుల కేసులో విపరీతమైన జాప్యం ఎందుకు జరగుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రతివాదులందరికీ సుప్రీం నోటీసులు జారీ చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు