Big Breaking: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్ పై తీర్పు రిజర్వ్.. మధ్యంతర బెయిల్ కు నో!

స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం.

New Update
Big Breaking: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్ పై తీర్పు రిజర్వ్.. మధ్యంతర బెయిల్ కు నో!

స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా.. చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే తన వాదనలను వర్చువల్ గా వినిపించారు. అవసరం అయితే.. లిఖితపూర్వంగా తన వాదనలు అందిస్తానని హరీశ్ సాల్వే కోరగా.. సుప్రీం ధర్మాసనం అందించింది. శుక్రవారంలోగా ఈ లిఖిత పూర్వక వాదనలు అదించాలని ఆదేశించింది. తీర్పు శుక్రవారం నాడు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది.

శుక్రవారం లేదా ఆ తర్వాత ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫైబర్ నెట్ కేసులోనూ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. శుక్రవారం నాడు ఈ పిటిషన్ పై విచారణ జరపనున్నట్లు తెలిపింది. ఆ రోజు కేసుల జాబితాలో చేర్చాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. క్వాష్ పిటిషన్, ఫైబర్ గ్రిడ్ కేసులోనూ శుక్రవారం నాడు తీర్పు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు తరఫు న్యాయవాదులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఈ రోజే తీర్పు వస్తుందని అంతా భావించారు. జైలులో చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదన్న వార్తల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు, చంద్రబాబు కుటుంబ సభ్యులు ఈ రోజు క్వాష్ పిటిషన్ పై సుప్రీం తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీం ధర్మాసనం.

Advertisment
Advertisment
తాజా కథనాలు