Big News: బీఆర్‌ఎస్‌కు సుప్రీంకోర్టు షాక్.. ఎన్నికల్లో కష్టాలు తప్పేలా లేవుగా..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఎన్నికల గుర్తుల కేటాయింపునకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 'రోడ్డు రోలర్', 'చపాతి మేకర్' లాంటి ఎన్నికల గుర్తులను కేటాయుంచద్దని, ఆ మేరకు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం.. బీఆర్ఎస్‌ వేసిన పిటిషన్‌ను కొట్టేసింది.

New Update
Big News: బీఆర్‌ఎస్‌కు సుప్రీంకోర్టు షాక్.. ఎన్నికల్లో కష్టాలు తప్పేలా లేవుగా..!

BRS Party Election Symbols: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్(BRS Party) పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం. ఎన్నికల గుర్తుల కేటాయింపునకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తమ పార్టీ గుర్తు కారును పోలిన 'రోడ్డు రోలర్', 'చపాతి మేకర్' లాంటి ఎన్నికల గుర్తులను కేటాయుంచద్దని, ఆ మేరకు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం.. బీఆర్ఎస్‌ వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఆ గుర్తులను తీసేయలేమని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఓటర్లకు అన్నీ తెలుసునని వ్యాఖ్యానించింది సుప్రీం ధర్మాసనం.

బీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారిన గుర్తులు..

బీఆర్ఎస్ పార్టీకి కొన్ని గుర్తులు మొదటి నుంచి తలనొప్పిగా మారాయి. ఈ గుర్తుల కారణంగా ఎన్నికల ఫలితాలే తారమారైన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఈ గుర్తుల విషయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ తీవ్ర ఆందోళనకు గురవుతుంది. కారును పోలిన గుర్తులు ఈవీఎంపై ఉండటం వలన.. ప్రజల అయోమయానికి గురై కారుకు బదులుగా మరొక గుర్తుపై ఓటు వేస్తున్నారు. దాంతో ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుంది.

కారుకు షాక్ ఇచ్చిన రోడ్ రోలర్, రోటీ మేకర్ గుర్తులు..

కారు గుర్తును పోలిన రోడ్ రోలర్, రోటీ మేకర్ గుర్తులు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్‌ ఇచ్చాయి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణం అవగా.. మరికొన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల మెజారిటీని తగ్గించాయి. మొన్నటి మొన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నికలోనూ కారును పోలిన గుర్తులు ఆ పార్టీ మెజారిటీకి గండి కొట్టాయని టాక్ వినిపించింది. ఆ ఎన్నికల్లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థ్యులకు ఈసీ కారును పోలిన గుర్తును కేటాయించింది. ఆ ముగ్గురికీ 6,551 ఓట్లు పోలయ్యాయి. వీరిలో రోటీమేకర్ గుర్తుకు 2,407 ఓట్లు, రోడ్ రోలర్ గుర్తుకు 1,874 ఓట్లు, చెప్పుల గుర్తుకు 2,270 ఓట్లు వచ్చాయి. ఈ మూడు గుర్తులు కారును పోలి ఉండటంతో.. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అభ్యర్థి మెజారిటీకి గండిపడినట్లయ్యింది.

ఇదికూడా చదవండి: దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు..

లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి..

సారు.. కారు.. పదహారు.. అనే నినాదంలో సార్వత్రిక ఎన్నికల కదనరంగంలోకి దిగిన నాటి టీఆర్ఎస్.. నేటీ బీఆర్ఎస్ పార్టీకి ఈ గుర్తులే పెద్ద ఝలక్ ఇచ్చాయి. 17 సీట్లలో 16 సీట్లు ఆశిస్తే.. కేవలం 9 సీట్లలో మాత్రమే ఆ పార్టీ గెలుపొందింది. 3 స్థానాలు కాంగ్రెస్ గెలుపొందగా.. 4 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఒకటి ఐఎంఐ ఖాతాలో పడింది. అయితే, గులాబీ పార్టీ ఆశించిన స్థానాలు గెలవకపోవడానికి అతిపెద్ద కారణం.. కారును పోలిన గుర్తులే. ఈ గుర్తుల కారణంగా భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ ఓటమి పాలయ్యారు. కేవలం 5,219 ఓట్ల తేడాతోనే బూర నర్సయ్య తన ప్రత్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఓడిపోయాడు. ఇందుకు కారణం.. రోడ్డు రోలర్ సహా మరికొన్ని కారును పోలిన గుర్తులేనని పొలిటిక్ విశ్లేషకులు చెబుతున్న మాట. రోడ్డు రోలర్ గుర్తుకు ఏకంగా 27,973 ఓట్లు పోలయ్యాయి. ఈ గుర్తు దాదాపు కారును పోలి ఉండటం వల్లే అన్ని ఓట్లు పోలయ్యాయని గులాబీ శ్రేణులు చెబుతున్న మాట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ట్రక్కు గుర్తు దెబ్బతీయగా.. పార్లమెంట్ ఎన్నికల్లో రోడ్ రోలర్ బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చింది.

ముందే అలర్ట్..

ఈ వరుస షాక్‌లతోనే గులాబీ పార్టీ ముందే అలర్ట్ అయ్యింది. అందుకే.. కారును పోలిన గుర్తులను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, సుప్రీంకోర్టులో చివరకు నిరాశే ఎదురైంది. గుర్తులను తొలగించేది లేదని తేల్చి చెప్పడంతో తలలు పట్టుకుంటున్నారు పార్టీ నేతలు.

ఇదికూడా చదవండి: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్..

Advertisment
Advertisment
తాజా కథనాలు