Big Breaking: చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సెక్షన్ 17-ఏ పంచాయితీ ఎటూ తేలకపోవడంతో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను మరో సారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ కేసును విచారించనుంది సుప్రీంకోర్టు. By Nikhil 10 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి ఏపీ స్కిల్ డవలప్మెంట్ కేసు (Skill Development Case) విషయమై చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై (Quash Petition) సుప్రీంకోర్టులో రెండో రోజు వాదనలు హోరాహోరీగా కొనసాగాయి. 17 ఏ సెక్షన్ చుట్టే వాదనలు సాగాయి. ఈ కేసుకు సంబంధించి 17 ఏ వర్తించదని సీఐడీ లాయర్లు వాదనలు వినిపిస్తే.. చంద్రబాబు లాయర్లు మాత్రం వర్తిస్తుందని వాదించారు. అయితే.. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఆ రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం 2 గంటలకు క్వాష్ పిటిషన్ పై విచారణ నిర్వహించనుంది సుప్రీంకోర్టు. సెక్షన్ 17-ఏ పంచాయితీ ఎటూ తేలకపోవడంతో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను మరో సారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే.. ఏపీ సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినపించారు. అయితే తదుపరి విచారణకు తాను వర్చువల్ గా హాజరు అవుతానని హరీశ్ సాల్వే వెల్లడించినట్లు సమాచారం. ఇది కూడా చదవండి: Nara Lokesh: నారా లోకేష్ సీఐడీ విచారణకు లంచ్ బ్రేక్.. మూడు గంటల పాటు అడిగిన ప్రశ్నలివే! ఈ రోజు జరిగిన విచారణ సందర్భంగా.. తన వాదనలకు బలం చేకూరేలా 17ఏ సెక్షన్ కు సంబంధించి గతంలో వివిధ కేసుల తీర్పులను హరీశ్ సాల్వే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రఫేల్ కేసును కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రఫెల్ కొనుగోళ్లపై 2019లో యశ్వంత్ సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను జస్టిస్ జోసెఫ్ కొట్టేసిన విషయాన్ని సాల్వే ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. 2018లో ఈ కేసుకు సంబంధిచిన విచారణ ప్రారంభమైందన్నారు. ఇందుకు పాత చట్టాలే ఆధారంగా తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న 2018లోనే ఈ కేసుకు సంబంధించి విచారణ ప్రారంభమైందన్నారు. 2021 డిసెంబర్ 9వ తేదీ రోజు ఎఫ్‌ఐఆర్ నమోదైందని కోర్టుకు వివరించారు. ఈ కేసులో రాజకీయ కక్ష సాధింపు లేదన్నారు. #chandrababu-arrest #supreme-court #ap-skill-development-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి