Supreme Court : న్యాయవ్యవస్థకు ముప్పు..సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ కొంతమంది న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు, సమగ్రతను దెబ్బతీ సేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని..దీని మీద చర్యలు తీసుకోవాలంటూ 600 మంది లాయర్లు సీఐఐ జస్టిస్ చంద్రచూడ్‌కు లేఖ రాశారు.సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మనన్ కుమార్ మిశ్రా లాంటి వారు ఇందులో ఉన్నారు. By Manogna alamuru 28 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Supreme Court Lawyers Letter To CJI : దేశంలో అన్నింటి కంటే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court). ఇక్కడ కచ్చితంగా న్యాయం జరుగుతుందనేది అందరి విశ్వాసం. కాని దాన్ని దెబ్బ తీస్తూ కొందరు న్యాయ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సుప్రీంకోర్టు లాయర్లు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించిన కేసుల్లో లాయర్ల మీద ఒత్తిడి పెరుగుతోందని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ న్యాయవాదులు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మనన్ కుమార్ మిశ్రా, ఆదిష్ అగర్వాలా, చేతన్ మిట్టల్, పింకీ ఆనంద్, హితేష్ జైన్, ఉజ్వల పవార్, ఉదయ్ హోల్లా, స్వరూపమా చతుర్వేది సహా దేశంలోని ప్రముఖ న్యాయవాదులు, భారతదేశ వ్యాప్తంగా దాదాపు 600 మందికి పైగా న్యాయవాదులు సీజేఐకి లేఖ రాశారు. Read more at: http://timesofindia.indiatimes.com/articleshow/108837507.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్(DY Chandrachud) కు లేఖ రాశారు. న్యాయవ్యవస్థలో రాజకీయం వేలుపెడుతోంది. పొలిటికల్ అజెండా(Political Agenda) తో కొందరు స్వార్ధ ప్రయోజనాలను ఆశించి ఒత్తిడి తీసుకువస్తున్నారని సుప్రీంకోర్టు లాయర్లు అంటున్నారు. న్యాయపరమైన ప్రక్రియలకు ఆటంకం కలిగిస్తూ...కోర్టు ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారని చెబుతున్నారు. దీని కోసం వాళ్ళు రకరకాల పనులు చేస్తున్నారు. కోర్టు తీర్పుల మీద తప్పుడు కథనాలు క్రియేట్ చేయడం లాంటివి కూడా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొందరు లాయర్లు ముందు రాజకీయనాయకుల్లో ముందు ఎవరినైతే తిడుతున్నారో తర్వాత వారి కేసులనే వాదిస్తున్నారు. అప్పుడు నచ్చనివారు..తరువాత ఎలా కరెక్ట్ అనిపిస్తున్నారో తెలియడం లేదని లేఖలో రాశారు. అలాగే కోర్టు నిర్ణయం ఏదైనా కూడా అంగీకరించాల్సిందే... అలా కాకుండా చాలా మంది బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. సోషల్ మీడియా(Social Media) లో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదని లాయర్లు లేఖలో కోరారు. న్యాయస్థానాలను రక్షించుకోవడానికి నిలబడే సమయం వచ్చిందని చెబుతున్నారు. అందుకే ఇలాంటి వాటి మీద కఠిన చర్యలను తీసుకోవాలని తమ లేఖలో కోరారు. Also Read : Stock Markets: ఈరోజు నుంచి టీ20 సెటిల్ మెంట్..లాభాల్లో కొనసాగుతున్న దేశీ మార్కెట్లు #supreme-court #letter #cji #lawyers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి