Rape case: బాలికలు లైంగిక కోరికలు తగ్గించుకోవాలన్న హైకోర్టుకు సుప్రీంకోర్టు చురకలు!

కౌమార దశలో ఉన్న ఆడపిల్లలు తమ లైంగిక వాంఛలను కంట్రోల్ చేసుకోవాలంటూ కోల్‌కతా హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్‌లో గతేడాది జరిగిన బాలిక లైంగికదాడి కేసు విచారణలో భాగంగా న్యాయమూర్తులు ప్రవచనాలు బోధించరాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

New Update
Supreme Court: పశ్చిమబెంగాల్‌, కేరళ గవర్నర్‌ కార్యాలయాలకు సుప్రీం కోర్టు నోటీసులు

Supreme Court: బెంగాల్‌లో గతేడాది జరిగిన బాలిక లైంగికదాడి కేసులో కోల్‌కతా హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌమార దశలో ఉన్న ఆడపిల్లలు తమ లైంగిక వాంఛలను కంట్రోల్ చేసుకోవాలంటూ ఇచ్చిన తీర్పుపై జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓక్, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ తీర్పును కొట్టేవేసింది. దీనిని అమానుషంగా పేర్కొంటూ నిందితుడికి విధించిన శిక్షను పునరుద్ధరించింది.

అసలేం జరిగిదంటే..
బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు రుజువు కావడంతో ట్రయల్‌ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష వేసింది. అయితే ఆ తీర్పును సవాల్‌ చేస్తూ అతను కోల్ కతా హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోల్ కతా హైకోర్టు.. ఆమె అంగీకారంతోనే అతనితో లైంగిక చర్యకు పాల్పడిందంటూ అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే ఈ సంఘటనను ఉద్దేశిస్తూ.. రెండు నిమిషాల లైంగిక ఆనందం కోసం బాలికలు సమాజంలో విలువకోల్పోతున్నారని, శృంగార కోరికలను అదుపులో పెట్టుకోవాలంటూ వ్యాఖ్యలు చేసింది.

ఇది కూడా చదవండి: RUNAMAFI: రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక నోడల్.. ఇవాళ్టి నుంచి ఫిర్యాదుల స్వీకరణ!

అయితే దీనిపై తాజాగా విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. ఇలాంటి తీర్పులో న్యాయమూర్తులు ప్రవచనాలు బోధించరాదంటూ మొట్టికాయలు వేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను రుద్దకూడదని, చట్టాన్ని అనుసరించాలని చురకలు అంటించింది. పోక్సో కేసుల్లో బాధితులను తల్లిదండ్రులు కూడా దూరం పెట్టకూడదని హతబోధ చేసింది. అత్యాచార కేసుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు ఆహారం, బట్టలు, ఆశ్రయం, విద్యావకాశాలు కల్పించాలని తెలిపింది. బాధితులకు పుట్టే సంతానాన్ని కూడా ప్రభుత్వమే సంరక్షించాలని చెప్పింది. అభయ కేసులోనూ బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసుపై అక్టోబరు 18 వరకూ నివేదిక సమర్పించాలని సూచించిన న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబరు 21కు వాయిదావేసింది. చివరగా న్యాయస్థానాలు తీర్పులను ఎలా రాయాలనే దానిపై కూడా ఆదేశాలిచ్చింది ధర్మాసనం.

Advertisment
Advertisment
తాజా కథనాలు