Supreme Court: ప్రైవేటు ఆస్తి..సమాజానికి చెందినది కాదని అనలేం..సుప్రీంకోర్టు వ్యాఖ్య

ప్రైవేటు ఆస్తిని ఒక్కరికే పరిమితం చేయడం మంచి విషయం కాదని అంది సుప్రీంకోర్టు. ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రైవేటు ఆస్తిని స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ప్రమాదకరం అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

New Update
Supreme Court: ప్రైవేటు ఆస్తి..సమాజానికి చెందినది కాదని అనలేం..సుప్రీంకోర్టు వ్యాఖ్య

Supreme Court: ప్రస్తుతం దేశంలో నడుస్తున్న హాట్ టాపిక్..సంపద పునఃపంపిణీ. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటనతో మొదలైన ఈ గొడవ అలా రాజుకుంటోంది. మేనిఫెస్టోలో అంశాలను ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడడం..దేశంలో సంపద అంతా కాంగ్రెస్ వాళ్ళు ముస్లిమ్‌లకు పంచేస్తారు అని కాంట్రవర్శీ కామెంట్స్ చేశారు. అప్పటి నుంచి దీని మీద ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యల గురించి ఈసీ కి కంప్లైంట్ కూడా చేశారు. ఇప్పుడు తాజాగా దీని మీద దేశ అత్యున్నత స్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా స్పందించింది.

ప్రవైటు ఆస్తిని సమాజవనరుగా పరిగణించకపోవడం, దాన్ని ఉమ్మడి ప్రయోజం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ప్రమాదకరం అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దేశం బాగుండాలంటే, సమాజ క్షేమం గురించి సంపద పునఃపంపిణీ జరగాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సమాజ వనరులుగా పరిగణించొచ్చా అన్న అంశంపై జరిగిన విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ముంబయ్‌లోని ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ సంపద పునఃపంపిణీ మీద వేసిన పిటిషన్ మీద కోర్టులో వాదనలు జరిగాయి. పీవోఏ తరుఫు న్యాయవాదులు ధర్మాసనం ఎదుట తమ వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను ప్రస్తావించిన (39 (బి), 31 (సి) అధికరణాలను సాకుగా చూపుతూ ప్రభుత్వ అధికారులు ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకోకూడదని లాయర్లు వాదించారు. కానీ సుప్రీం ధర్మాసన్ ఈ వాదనలతో ఏకీభవించలేదు. ప్రభుత్వ వనరులు మాత్రమే సమాజ వనరులుగా పరిగణించాలనడం సరికాదని...అలాంటి అభిప్రాయం తప్పు అవుతుందని అంది. ఉదాహరణకు ప్రైవేటు అడవులకు ప్రభుత్వ విధానాలు వర్తించవు, అందువల్ల సర్కారు దాని విషయంలో జోక్యంచేసుకోజాలదు అనడం తగదు అని అభిప్రాయాన్ని వక్యక్తం చేసింది. రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు ఉన్న సామాజిక స్థితిగతులను ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది.

సమాజంలో సంపద అంతా ఒకరి దగ్గరే ఉండాలని రాజ్యాంగం ఎప్పుడూ చెప్పేలదని కోర్టు అంది. సమాజ సంక్షేమానికి చర్యలు అవసరం. దాని కోసం సంపద పునఃపంపిణీ జరగాలి అని ధర్మాసన్ వ్యాఖ్యానించింది. ఇందులో బాగంగానే జమిందారీ వ్యవస్థను రద్దు చేశామని గుర్తు చేసింది. ఇక శిథిలావస్థలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకోవడానికి అధికారులకు వీలు కల్పించే మహారాష్ట్ర చట్టం చెల్లుబాటు అవుతుందా లేదా అన్నది పూర్తిగా భిన్నమైన అంశమని ధర్మాసనం తెలిపింది. దానిపై విడిగా ఉత్తర్వులిస్తామని స్పష్టంచేసింది.

Also Read:Telangana : నేడు తెలంగాణ బీజేపీ నేతల నామినేషన్లు

Advertisment
Advertisment
తాజా కథనాలు