Supreme Court: మూఢ నమ్మకాలు, తాంత్రిక విద్యలు..న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయం కాదు!

భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమే అయినా... మూఢనమ్మకాలు, చేతబడులు ఇంకా ఏదోక మూల వాటి ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ప్రజల్లో అక్షరాస్యత శాతాన్ని పెంపొందిస్తే ఇలాంటి సామాజిక రుగ్మతలన్నీ మాయమవుతాయని సుప్రీం కోర్టు పేర్కొంది.

New Update
Supreme Court on Promotions: ప్రమోషన్స్ విషయంలో అలా చేస్తే ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే: సుప్రీంకోర్టు 

Supreme Court: భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమే అయినా... మూఢనమ్మకాలు, చేతబడులు, క్షుద్రపూజలు, తాంత్రిక శక్తులు ఇంకా ఏదోక మూల వాటి ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేశంలో మూఢ నమ్మకాలను, తాంత్రిక విద్యలను కట్టడి చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.

అయితే ఈ పిల్ పై విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం... ఈ విషయంలో తాము కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను ఎలా ఆదేశించగలమని పేర్కొంది.

"దేశంలో మూఢనమ్మకాలను పారదోలాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నకు నిజమైన సమాధానం ఏంటేంటే అది చదువే.... ప్రజల్లో అక్షరాస్యత శాతాన్ని పెంపొందిస్తే ఇలాంటి సామాజిక రుగ్మతలన్నీ మాయమవుతాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని నెలకొల్పాలి. ప్రజలు బాగా విద్యావంతులు అయినప్పుడు ఇలాంటి దురాచారాలన్నీ తొలగిపోతాయన్నది ఓ నిజం. అయితే ఇవన్నీ కోర్టులు ఆదేశిస్తేనో, హెచ్చరికలు జారీ చేస్తేనో ఆగేవి కావు. మూఢనమ్మకాలను నిర్మూలించండి అని న్యాయ వ్యవస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎలా ఆదేశించగలదు? అని సుప్రీం ప్రశ్నించింది.

Also read: మీరు ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్నారా..అయితే ఈ శుభవార్త మీకోసమే!

Advertisment