Rajnikanth: అయోధ్యలో సూపర్ స్టార్...హనుమాన్ గర్హిని దర్శించుకున్న రజనీకాంత్..!! సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఉన్నారు. తొలుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అనంతరం ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో సమావేశం అయ్యారు. ఆ తర్వాత అయోధ్య చేరుకుని హనుమాన్ గర్హిని దర్శించుకున్నారు. By Bhoomi 21 Aug 2023 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Rajinikanth visited Hanuman Garhi : సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రంపై ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మీడియా కథనాల ప్రకారం, ఈ చిత్రం ఇప్పటివరకు 235.85 కోట్లు వసూలు చేసింది. మరోవైపు వరల్డ్ వైడ్ గా మాట్లాడుకుంటే 426.7 కోట్లు రాబట్టింది.తన సినిమా సక్సెస్ నేపథ్యంలో రజనీకాంత్ తన భార్యతో కలసి అయోధ్యుకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #WATCH | Uttar Pradesh | Actor Rajinikanth offers prayers at Hanumangarhi temple in Ayodhya. pic.twitter.com/OXoLM8bNA7— ANI (@ANI) August 20, 2023 ఆదివారం అయోధ్యలోని హనుమాన్‌గర్హి ఆలయంలో రజనీకాంత్ పూజలు నిర్వహించారు.హనుమంతుని పాదాలకు నమస్కరించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు చరణామృతాన్ని అందజేశారు. దాదాపు ఐదు నిమిషాల పాటు రాముడి దివ్య స్వరూపాన్ని చూశాడు. రామమందిరాన్ని సందర్శించడం నేను అద్రుష్టంగా భావిస్తాను. రామమందరి పూర్తయ్యే సమయంకోసం నిరీక్షిస్తున్నానంటూ రజనీకాంత్ అన్నారు. #WATCH | Uttar Pradesh | After offering prayers at Hanumangarhi temple in Ayodhya, Actor Rajinikanth says "I am very fortunate. I always wanted to visit here..." pic.twitter.com/tyHAoSuY2W— ANI (@ANI) August 20, 2023 అంతకుముందు రజనీకాంత్ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను లక్నోలోని అతని నివాసంలో కలిశారు. అటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో రజనీకాంత్ భేటీ అయ్యారు. రజనీకాంత్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదే సమయంలో రజనీకాంత్‌కు సీఎం యోగి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. #ayodhya #up #rajnikanth #rajinikanth-visited-hanuman-garhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి