Health Drinks: షుగర్‌ను కంట్రోల్‌ చేసే సూపర్‌ డ్రింక్స్‌..ఇంట్లోనే సులభంగా తయారీ

మధుమేహంతో ఇబ్బది పడేవారు మెంతి గింజలను నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచిదని నిపుణులు అంటున్నారు. డయాబెటిస్ ఉన్నవారిలో శరీర బరువును నియంత్రలో ఉండాలంటే.. కలబందలో కొంచెం తేనె, పంచదార, నిమ్మరసం, ఎండుమిర్చి, రాళ్ల ఉప్పు వేసి జ్యూస్ తాగితే మంచిది.

New Update
Health Drinks: షుగర్‌ను కంట్రోల్‌ చేసే సూపర్‌ డ్రింక్స్‌..ఇంట్లోనే సులభంగా తయారీ

Health Drinks: మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాటిలో సూపర్ డ్రింక్స్ ఒకటి. సాధారణంగా 30 ఏళ్ల తర్వాత మన ఆరోగ్య పరిస్థితి మారుతుంది. ప్రాచీన కాలంలో మనిషి ఆయుష్షు వందేళ్లుగా చెప్పేవారు. ఇప్పుడు మనిషి జీవిత కాలం 60 నుంచి 70 ఏళ్లకు పడిపోయింది. చిన్న వయసులోనే ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలు వస్తున్నాయి. అనేక మందికి మధుమేహం వస్తోంది. కొన్ని జ్యూస్‌లు తీసుకోవడం వల్ల మధుమేహాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఆ జ్యూస్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మెంతికూర నానబెట్టిన నీరు:

  • మెంతికూర చక్కెరను నియంత్రించడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కరిగే ఫైబర్ ఇందులో ఉంటుంది. మెంతి గింజలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్, రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. రాత్రి పడుకునే ముందు రెండు టేబుల్ స్పూన్ల మెంతి గింజలను నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి.

అలోవెరా జ్యూస్:

  • కలబంద మన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారిలో శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. కలబందలో కొంచెం తేనె, పంచదార, నిమ్మరసం, ఎండుమిర్చి, రాళ్ల ఉప్పు వేసి జ్యూస్ తయారు చేసుకోవడం మంచిది.

చియా సీడ్ వాటర్:

  • ఫైబర్, ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. చియా విత్తనాలు తక్కువ తీపి కలిగి ఉంటాయి. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని నివారిస్తాయి. ఒక టేబుల్ స్పూన్ చియా గింజలను ఒక బాటిల్ నీటిలో నానబెట్టి, దానికి నిమ్మకాయ రసం వేసుకుని తాగితే డ్రై స్కిన్‌ సమస్య ఉండదు. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ తగ్గుతాయి.

తులసి టీ:

  • తులసిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని అభివృద్ధి చేస్తుంది. దీనిలోని గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఒక గ్లాసు వేడినీళ్లలో కొన్ని తులసి ఆకులను వేసి అందులో అల్లం, నిమ్మరసం కలుపుకుని తాగడం మంచిది.

కొత్తిమీర:

  • కొత్తిమీర మంటను తగ్గించే, ఒత్తిడిని పోగొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కొత్తిమీర ఇన్సులిన్ యాక్టివిటీని పెంచి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. కొత్తిమీర నానబెట్టిన నీటిని తాగడం అలవాటు చేసుకుంటే థైరాయిడ్ సమస్య, కాళ్లు, చేతుల నొప్పులు దూరం అవుతాయి.

వైద్యుల సలహా:

  • షుగర్ వ్యాధితో బాధపడే వారు ఉదయం లేవగానే కనీసం గంటపాటు వ్యాయామం చేయాలి. భోజనం, స్నాక్స్ విషయానికి వస్తే గంటకోసారి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు. బ్రేక్ ఫాస్ట్‌లో ప్రొటీన్లు ఉండే ఆహార పదార్థాలను తినడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఊబకాయం ఉన్నవారికి బ్లడ్ క్యాన్సర్ వస్తుందా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు