Sunita Williams: అంతరిక్ష కేంద్రంలో చిక్కుల్లో సునీత విలియమ్స్ టీమ్.. ఏమైందంటే.. 

సునీత విలియమ్స్, ఆమె సహచరులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. అక్కడ సూపర్‌బగ్‌గా పిలిచే 'ఎంటర్‌బాక్టర్ బుగాండెన్సిస్'ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

New Update
Sunita Williams: అంతరిక్ష కేంద్రంలో చిక్కుల్లో సునీత విలియమ్స్ టీమ్.. ఏమైందంటే.. 

Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో సూపర్‌బగ్‌గా పిలిచే 'ఎంటర్‌బాక్టర్ బుగాండెన్సిస్' అనే బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా క్లోజ్డ్ ఎన్విరాన్‌మెంట్‌లో పెరుగుతుందని, బహుళ ఔషధాలకు నిరోధకత(మల్టీ డ్రగ్ రెసిస్టెంట్)ను కలిగి ఉంటుందని వివరించారు. ఈ బ్యాక్టీరియా బహుళ ఔషధాలకు నిరోధకతను కలిగి ఉండడంతో దీనిని "సూపర్‌బగ్" అని పిలుస్తారు. ఇది  శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Sunita Williams: ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారతీయ వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఎనిమిది మంది సిబ్బంది కూడా ఈ "సూపర్‌బగ్" ఇబ్బందిలో చిక్కుకున్నారు. సునీతా విలియమ్స్, వ్యోమగామి బారీ యూజీన్ జూన్ 6, 2024న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. మిగిలిన ఏడుగురు సిబ్బంది చాలా కాలంగా అక్కడే ఉన్నారు. ఈ 'స్పేస్ బగ్స్' గ్రహాంతరవాసులకు సంబంధించినవి కావని, భూమి నుంచి వ్యోమగాముల ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వచ్చాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Also Read: ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఆపిల్ కంపెనీ

భారతీయుడి నేతృత్వంలో పరిశోధనలు
అంతరిక్ష కేంద్రంలో పనిచేసే వ్యోమగాములు ప్రత్యేక పరిస్థితుల్లో పని చేస్తారు. అంతరిక్ష యాత్రల సమయంలో వివిధ ఆరోగ్య సవాళ్లు ఎదురవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. వ్యోమగాములు సంప్రదాయ వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్న సమయంలో వారి ఆరోగ్యంపై సూక్ష్మజీవుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాలిఫోర్నియాలోని పసాదేనాలో ఉన్న నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి చెందిన డాక్టర్ కస్తూరి వెంకటేశ్వరన్ ఈ పరిశోధన చేస్తున్నారు. నాసాలో చేరడానికి ముందు వెంకటేశ్వరన్ చెన్నైలోని అన్నామలై యూనివర్సిటీలో మెరైన్ మైక్రోబయాలజీ చదివారు.

ఐదు రోజుల క్రితమే..
భారత సంతతికి చెందిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ల అంతరిక్ష నౌక జూన్ 6 రాత్రి 11:03 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి చేరుకుంది. నిజానికి ఇది గురువారం రాత్రి 9:45 గంటలకు చేరుకోవాల్సి ఉంది, కానీ రియాక్షన్ కంట్రోల్ థ్రస్టర్‌లో సమస్య కారణంగా ఇది విజయవంతం కాలేదు. రెండవ ప్రయత్నంలో, అంతరిక్ష కేంద్రంతో డాకింగ్ చేయడంలో వ్యోమనౌక విజయవంతమైంది. 

Sunita Williams: బోయింగ్ స్టార్‌లైనర్ మిషన్ బుధవారం, జూన్ 5, భారత కాలమానం ప్రకారం రాత్రి 8:22 గంటలకు ప్రారంభం అయింది. ఇది ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుండి ULA అట్లాస్ V రాకెట్‌లో ప్రయోగించారు. స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక – దాని ఉపవ్యవస్థలను పరీక్షించడానికి విల్మోర్, విలియమ్స్ ఇద్దరూ దాదాపు ఒక వారం పాటు అంతరిక్ష కేంద్రంలో ఉంటారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు