Summer Special Drink : సమ్మర్ స్పెషల్ మొహబ్బత్ కా షర్బత్.. ట్రై చేయండి అదిరిపోతుంది

మొహబ్బత్ కా షర్బత్ ఢిల్లీలోని ప్రసిద్ధ వేసవి పానీయం. దీనిని పుచ్చకాయ ముక్కలు, గులాబీ రేకులను ఉపయోగించి తయారు చేస్తారు. ఈ సమ్మర్ డ్రింక్ వేడి నుంచి ఉపశమనాన్ని అందించడంతో పాటు శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ రెసిపీ తయారీ విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Summer Special Drink : సమ్మర్ స్పెషల్ మొహబ్బత్ కా షర్బత్.. ట్రై చేయండి అదిరిపోతుంది

Summer Drink : మండే వేడి(Heat), ఎండ(Sun) నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి, ప్రజలు తరచుగా వివిధ రకాల పానీయాలను తీసుకుంటారు. ఈ పానీయాలు వేడి నుంచి ఉపశమనాన్ని అందించడమే కాకుండా శరీరాన్ని చల్లబరుస్తాయి. కడుపుకు మంచివిగా పరిగణించబడతాయి. అలాంటి అద్భుతమైన పానీయాలలో ఒకటి మొహబ్బత్ కా షర్బత్. మొహబ్బత్ కా షర్బత్(Mohabbat Ka Sharbat) అనేది ఢిల్లీలోని ప్రసిద్ధ వేసవి పానీయం. దీనిని పుచ్చకాయ ముక్కలు, గులాబీ రేకులను ఉపయోగించి తయారుచేస్తారు. ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ రుచికరమైన, రిఫ్రెషింగ్ లవ్ సిరప్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము..

మొహబ్బత్ కా షర్బత్ తయారీకి కావలసిన పదార్థాలు

  • 2 కప్పులు చల్లని పాలు
  • ¼ కప్పు చక్కెర
  • 3 టేబుల్ స్పూన్లు రోజ్ సిరప్
  • 1 కప్పు పుచ్చకాయ రసం
  • 1 కప్పు సన్నగా తరిగిన పుచ్చకాయ ముక్కలు
  • 1 కప్పు చల్లని నీరు
  • 20-25 ఐస్ క్యూబ్ ముక్కలు
  • 10-15 తాజా గులాబీలు రేకులు

publive-image

మొహబ్బత్ కా షర్బత్ తయారు చేసే విధానం

  • ముందుగా ఒక గిన్నెలో పాలు , చక్కెర, రోజ్ సిరప్(Rose Syrup) వేసుకోవాలి. ఆ తర్వాత పాలలో చక్కర పూర్తి కరిగే వరకు బాగా కలుపుతూ ఉండాలి.
  • చక్కర పూర్తిగా కరిగిన తర్వాత అందులో పుచ్చకాయ రసం, పుచ్చకాయ ముక్కలు, కూల్ వాటర్ వేసుకోవాలి. మరో సారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
  • చివరిగా దీంట్లో ఐస్ క్యూబ్స్, వేసి గులాబీ రేకులతో గార్నిష్ చేస్తే సరిపోతుంది. అంతే సమ్మర్ స్పెషల్ డ్రింక్ మొహబ్బత్ కా షర్బత్రెడీ. వేసవిలో ఈ చాలా మంచిది. శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది.

Also Read: Vastu Tips: బెడ్ రూమ్ లో ఈ వస్తువులను వెంటనే తీసేయండి..! లేదంటే గొడవలు పెరుగుతాయి..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CLP meeting : కాంగ్రెస్ MLA ల జీతాలు కట్....పార్టీ కీలక నిర్ణయం

పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, ప్రతి ఎమ్మెల్యే తమ జీతం నుంచి నెలకి రూ.25 వేలు తప్పనిసరిగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి హుకూం జారీ చేసారు. పార్టీ ఆర్థిక అవసరాలు, ఇతర పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం వీటిని వినియోగించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

New Update
CLP meeting

CLP meeting

CLP meeting :  పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, ప్రతి ఎమ్మెల్యే తమ జీతం నుంచి నెలకి రూ.25,000 విరాళం తప్పనిసరిగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి హుకూం జారీ చేసారు. పార్టీ ఆర్థిక అవసరాలు, రాబోయే ఎన్నికల సన్నాహాలు, ఇతర పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం ఈ విరాళాలను వినియోగించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని నోవోటెల్‌ వేదికగా జరిగిన CLP మీటింగ్‌లో సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీకి ఆర్థికంగా అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హస్తం నేతలందరి లక్ష్యం ఒక్కటే అయ్యి ఉండాలని.. రెండోసారి ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.

Also Read :  ఎండకాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు.. సగటు కంటే 105% ఎక్కవ వర్షపాతం

ఇక నుంచి ఎమ్మెల్యేలంతా జనాల్లో ఉండాలని, విస్తృతంగా గ్రామాల్లో పర్యటించాలని రేవంత్‌ సూచించారు.పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడకూడదు. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తా అంటే కుదరదని హెచ్చరించారు.భయపడే పరిస్థితిలో పార్టీ లేదు. అద్దంకి దయాకర్‌లాగా అందరూ ఓపికతో ఉండాలి.అద్దంకి దయాకర్ ఓపికగా ఉన్నాడు కాబట్టే ఎమ్మెల్సీ అయ్యాడని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!

 మంత్రివర్గ విస్తరణ అంశం హైకమాండ్ చూసుకుంటుందని, మంత్రివర్గ విస్తరణ గురించి ఎవరూ బహిరంగంగా బయట మాట్లాడొద్దని సీఎం వార్నింగ్ ఇచ్చారు. సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చ జరిగింది. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలతోపాటు ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంపై నేతలకు వివరించారు సీఎం రేవంత్‌ రెడ్డి.

 

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

Advertisment
Advertisment
Advertisment