PAK: పాకిస్థాన్ లో కొత్త టెర్రర్ గ్రూప్.. సైన్యానికి పెనుసవాలు పాకిస్థాన్ లో కొత్తగా పుట్టుకొచ్చిన టీజేపీ అనే ఉగ్ర సంస్థ సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ దేశ సైన్యమే లక్ష్యంగా వరుస దాడులకు తెగబడుతూ పాక్ సార్వభౌమత్వాన్నే ఆ సంస్థ సవాలు చేస్తోంది. మంగళవారం జరిగిన దాడిలో 25 మంది సైనికులు మృతిచెందారు. By Naren Kumar 12 Dec 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Pak Army: ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్నట్టు.. పాకిస్థాన్ సృష్టించిన ఉగ్రభూతం ఇప్పుడు ఆ దేశంపైనే కోరలు చాస్తోంది. ఉగ్రమూకలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న పాకిస్థాన్ లో ఇప్పుడు కొత్తగా మరో ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించి ఆ దేశ సైన్యానికి, తద్వారా దేశ సార్వభౌమత్వానికి సవాలు విసురుతోంది. ఆ సంస్థ పేరు తెహ్రీకే జిహాద్ పాకిస్థాన్ (టీజేపీ). ఇది కూడా చదవండి: ‘ఇది ప్రమాదకరం’.. పుతిన్‌కు నెతన్యాహు ఫోన్! ఫిబ్రవరిలో మొదలైన టీజేపీ ఇప్పటికే పదీ పన్నెండు బీభత్సాలను సృష్టించింది. తాజాగా పాక్ సైన్యంపై దాడికి తెగబడింది. సాయుధ జిహాద్ ద్వారా పాకిస్థాన్ లో ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యమని ఈ సంస్థ ప్రకటించింది. ఇదిలా ఉండగా, గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఉగ్రదాడులు 80 శాతం పెరిగాయని పాకిస్థాన్ భద్రతా విభాగం వెల్లడించింది. ఇది కూడా చదవండి: పోలీస్ స్టేషన్ పై ఆత్మాహుతి దాడి.. 24 మంది మృతి పాకిస్థాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 23మంది మృతిచెందగా, 27 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. పాకిస్థాన్ లో తాలిబన్ సంస్థకు అనుబంధంగా ఏర్పడిన ‘తెహ్రీకే ఈ జిహాద్ పాకిస్థాన్’ అనే సంస్థ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించుకుంది. ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్సులో జరిగిన మూడు వేర్వేరు సంఘటనల్లో పాక్ సైన్యానికి ఈ తీవ్ర నష్టం వాటిల్లింది. ‘డేరా ఇస్మాయిల్ ఖాన్’ జిల్లాలోని ఓ స్కూల్ బిల్డింగులో పాక్ సైన్యం ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక సైనిక స్థావరాన్ని మంగళవారం ఉదయం పేలుడు పదార్థాలతో నిండిన కారుతో ఉగ్రవాదులు ఢీకొట్టారు. దీంతో పదుల సంఖ్యలో సైనికుల ప్రాణాలు గాలిలో కలిశాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. #pakistan-army #tjp #terror-group మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి