Sugar: చేదెక్కనున్న పంచదార ..పండుగల ముందు షాక్! రానున్న రోజుల్లో మిఠాయిలు తినలేని పరిస్థితి ఏర్పడేటట్లు ఉంది. ఎందుకంటే మిఠాయిలు చేయడానికి ఉపయోగించే పంచదార ధరలు కొండెక్కి కూర్చున్నాయి. By Bhavana 06 Sep 2023 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి శ్రావణ మాసం పూర్తి కావొచ్చింది. మరి కొద్ది రోజుల్లో వినాయక చవితి, దేవి నవరాత్రులు, దీపావళి ఇక వరుసగా అన్ని పండుగలే..పండుగలే అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేవి ..మిఠాయిలు. కానీ రానున్న రోజుల్లో మిఠాయిలు తినలేని పరిస్థితి ఏర్పడేటట్లు ఉంది. ఎందుకంటే మిఠాయిలు చేయడానికి ఉపయోగించే పంచదార ధరలు కొండెక్కి కూర్చున్నాయి. రోజురోజుకి పంచదార(Sugar) ధరలు (Prices) మండిపోతున్నాయి. ఆరు సంవత్సరాల గరిష్ట స్థాయికి చక్కెర ధర చేరుకుంది. ఈ సంవత్సరం చెరుకు పంట వానల వల్ల తీవ్రంగా నష్టపోయింది. దీంతో ఉత్పత్తి తగ్గింది. చెరుకు ఉత్పత్తి తగ్గింది అంటే ఆటోమేటిక్ గా పంచదార ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో పంచదార ధర ఒక్కసారిగా వినియోగదారునికి చేదు పుట్టిస్తుంది. చెరుకు ఉత్పత్తులు భారీగా తగ్గడం వల్ల చక్కెర మిల్లుల అధినేతలు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితులు చెరుకు పంటపై తీవ్ర ప్రభావం చూపడంతోనే చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మిల్లు యజమాన్యాలు అయితే చక్కెరను తక్కువ ధరకు అయితే అందించవు. ఆ పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఎంత లేదు అనుకున్న అక్టోబర్ లో 3.3 శాతం చక్కెర ఉత్పత్తి క్షీణించి 31.7 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తిని మాత్రమే విడుదల చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలలో చెరుకు పంట బాగా దెబ్బతింది. మరి కొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలకు పంచదార ఎగుమతిని నిలిపివేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గోధుమలు, బియ్యం ఎగుమతులను నిలిపివేసింది. రానున్న రోజుల్లో చక్కెర ఎగుమతిని కూడా ఆపివేస్తే..ఏడేళ్లలో చక్కెర ఎగుమతి పై నిషేధం విధించడం ఇదే మొదటి సారి అవుతుంది. జులై లో మార్కెట్‌లో చక్కెర ధర కిలోకు రూ. 42.98 ఉండగా, సెప్టెంబర్ నాటికి కిలో రూ.43.42కి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. కాగా ఈ ఏడాది జనవరి నాటికి కిలో రూ.41.45గా ఉంది. చక్కెర ధరలు పెరిగేత కనుక రానున్న రోజుల్లో స్వీట్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ అన్ని కూడా ధరలు పెరిగే అవకాశాలున్నాయి. #price #increase #sugar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి