Sugar Prices: చుక్కల్లో చక్కెర..మూడు వారాల్లో గరిష్టంగా పెరిగిన ధరలు!

గత కొద్ది రోజుల నుంచి చక్కెర(Sugar) ధరలు చుక్కలనంటుతున్నాయి. గడిచిన మూడు వారాలుగా చూసుకుంటే చక్కెర ధర రికార్డు స్థాయికి చేరుకుంది.

New Update
Sugar Prices: చుక్కల్లో చక్కెర..మూడు వారాల్లో గరిష్టంగా పెరిగిన ధరలు!

నిన్న మొన్నటి వరకు ఆకాశంలో ఉన్న టమాటా (Tamato) ధరలు (Prices) నెమ్మదిగా కిందకి దిగి వచ్చాయి..ఇప్పుడు సరైన ధరలు లేక కాలువలు, వాగుల పాలు అవుతున్నాయి. బియ్యం(Rices) ,పప్పులు(Dal), మరికొన్ని నిత్యావసరాల ధరలు కూడా అదే బాటలో వెళ్తున్నాయి. తాజాగా ఆ బాటలోకి పంచదార వచ్చి చేరింది.

గత కొద్ది రోజుల నుంచి చక్కెర(Sugar) ధరలు చుక్కలనంటుతున్నాయి. గడిచిన మూడు వారాలుగా చూసుకుంటే చక్కెర ధర రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ ధరలు మరో 2-3 నెలలు కొనసాగే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల చెరుకు ఉత్పత్తి గణనీయంగా తగ్గింది.

అందువల్లే చక్కెర నిల్వల కొరత వచ్చి చేరింది. ఈ క్రమంలో చక్కెరను విదేశాలకు ఉత్పత్తి చేయకుండా కేంద్రం త్వరలోనే ఆంక్షలు విధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇలా కేంద్రం కానీ చక్కెర ఎగుమతిని అడ్డుకున్నట్లయితే..అంతర్జాతీయంగా కూడా చక్కెర ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సుమారు 12 సంవత్సరాల తరువాత చక్కెర ధరలు గరిష్ఠ స్థాయికి చేరుతాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో చక్కెర ఉత్పత్తి పడిపోతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. 2023, అక్టోబర్‌-2024, సెప్టెంబర్‌ సీజన్‌లో నికర చక్కెర ఉత్పత్తి 31.7 మిలియన్‌ టన్నులుగా ఉంటుందని ఇండియన్‌ సుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ చెబుతుంది.

కానీ ఆగస్టు నెలలో ప్రధానంగా చెరుకు ఎక్కువగా పండిస్తున్న మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా మెజార్టీ ప్రాంతల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చక్కెర ఉత్పత్తి బాగా తగ్గింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు