Sudha Kongara : సూర్య సినిమాని పక్కన పెట్టి.. ఆ స్టార్ హీరో కొడుతో సుధా కొంగర న్యూ ప్రాజెక్ట్?

తమిళ దర్శకురాలు సుధా కొంగర సూర్య 'పురాణనూరు' సినిమాని పక్కనపెట్టి ధృవ్ విక్రమ్ తో ఓ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం.

New Update
Sudha Kongara : సూర్య సినిమాని పక్కన పెట్టి..  ఆ స్టార్ హీరో కొడుతో సుధా కొంగర న్యూ ప్రాజెక్ట్?

Sudha Kongara - Suriya Movie Postponed : సౌత్ సినీ ఇండ్రస్ట్రీ(South Cine Industry) లో లేడీ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నారు సుధా కొంగర(Sudha Kongara). గురు, ఆకాశం నీ హద్దురా వంటి సినిమాలతో దర్శకురాలిగా ప్రశంసలు అందుకుంది. 2010 లో దర్శకురాలిగా మెగా ఫోన్ పట్టిన ఈమె.. 2016 లో 'ఇరుదు చుట్రు' సినిమాతో భారీ హిట్ అందుకుంది. మాధవన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ రితికా సింగ్(Ritika Singh) హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇదే సినిమాని 'గురు' పేరుతో తెలుగులో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) తో రీమేక్ చేసి ఇక్కడ కూడా సక్సెస్ సాధించింది.

అనంతరం 2022లో సూర్య తో 'సురరై పోట్రు' (తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదలయింది) సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇప్పుడు మరోసారి సూర్య తో 'పురాణనూరు' అనే సినిమా చేస్తోంది. పలు అనివార్య కారణాలతో ఆలస్యమౌతూ వస్తున్న ఈ మూవీ షూటింగ్ ని కొద్ది రోజులు వాయిదా వేస్తున్నట్లు ఆ మధ్య అధికారికంగా ప్రకటించారు. దీంతో సూర్య కార్తీక్ సుబ్బరాజ్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

ఇలాంటి తరుణంలో సుధా కొంగర ఇప్పుడు సూర్య సినిమాని పక్కన పెట్టి చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అయినట్లు తాజా సమాచారం బయటికి వచ్చింది. అంతేకాదు ఈ సినిమాకి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నట్లు తెలిసింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఏ బ్యానర్ లో ఉండబోతోంది? ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లబోతోంది? తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ధృవ్ విక్రమ్ ప్రస్తుతం మారి సెల్వరాజ్ డైరెక్క్షన్ లో ఓ సినిమాకి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాని 'కబాలి' మూవీ డైరెక్టర్ పా.రంజిత్ తన హోమ్ బ్యానర్ నీలం ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. అటు సుధా కొంగర ప్రెజెంట్ అక్షయ్ కుమార్ తో 'ఆకాశం నీ హద్దురా' సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.

Also Read : పవన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. వకీల్ సాబ్ రీ రిలీజ్

Advertisment
Advertisment
తాజా కథనాలు