Success Story: నాడు పాత్రలు కడిగిన వ్యక్తి.. నేడు 100 రెస్టారెంట్లకు యజమాని.. సక్సెస్ సీక్రెట్స్ ఇవే!

ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే..సాధించేంత వరకు మధ్యలో విశ్రమించకూడదు అంటారు. జయరామ్ బనన్ కూడా అదే కోవాకి చెందినవారే. ఒకప్పుడు పాత్రలు కడిగి..నేడు రూ.300కోట్ల కంపెనీకి యజమాని అయ్యాడు. ఇంతకీ ఈ జయరామ్ బనన్ ఎవరు?ఏంటీ ఆయన సక్సెస్ స్టోరీ?

New Update
Success Story: నాడు పాత్రలు కడిగిన వ్యక్తి.. నేడు 100 రెస్టారెంట్లకు యజమాని.. సక్సెస్ సీక్రెట్స్ ఇవే!

Sagar Ratna's Jayaram Banan Success Story:  కాలం ఎప్పుడు ఎవర్ని ఎలా తీర్చిదిద్దుతుందో తెలియదు. ఓడలు బండ్లు అవుతాయి..బండ్లు ఓడలు అవుతాయి. ఈ సామేత మనందరికీ తెలిసిందే. రాత్రి రాత్రికే కోటీశ్వరులు అయినవారు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని..ఆ లక్ష్యాన్న సాధించేంత వరకు కష్టపడితే..గమ్యాన్ని చేరుకోవడం సులువు అవుతుంది. ఇలాంటి మాటలు చాలా మంది విన్నా..కొందరిలోనే అనుసరించే సత్తా ఉంటుంది. అలాంటి కోవాలోకే వస్తారు జయరామ్ బనన్ (Jayaram Banan). ఒకప్పుడు పాత్రలు కడిగి..నేడు రూ.300కోట్ల కంపెనీకి యజమాని అయ్యాడు. ఇంతకీ ఈ జయరామ్ బనన్ ఎవరు?ఏంటీ ఆయన సక్సెస్ స్టోరీ? తెలుసుకుందాం.

జైరామ్ బనన్ సాగర్ రత్న రెస్టారెంట్స్ యజమాని. తండ్రి కొడతాడన్న భయంతో ఇంటి నుంచి కూడా వెళ్లిపోయాడు. అయితే ఓటమిని అంగీకరించకుండా తన కష్టార్జితాన్ని ఆసరాగా చేసుకుని నేడు కోట్లాది రూపాయల ఫుడ్ చైన్‌ను తెరిచాడు. ఏటా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంత భారీ విజయాన్ని జైరామ్ బనన్ ఎలా సాధించాడో తెలుసా?

ఈ కారణంతోనే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు:
మంగళూరు (కర్ణాటక) సమీపంలో ఉన్న 'ఉడిపి'కి చెందిన సాధారణ కుటుంబంలో జన్మించిన జయరామ్ బానన్ తండ్రి డ్రైవర్. జైరామ్ తండ్రికి కోపం స్వభావం. తన తండ్రిని చూస్తే భయపడేవాడు. జయరామ్ పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు, తన తండ్రి తనను కొడతాడని భావించి..భయంతో 13 ఏళ్లకే ఇంటి నుంచి పారిపోయాడు. ఇంటి నుండి పారిపోయే ముందు, అతను తన తండ్రి జేబులో నుండి కొంత డబ్బు తీసి, మంగళూరు నుండి ముంబైకి బస్సు ఎక్కాడు. ఆవిధంగా బనన్ 1967లో ముంబైకి చేరుకున్నారు.

Sagar Ratna's Jayaram Banan Success Story

దాబాలో పాత్రలు కడిగాడు:
జయరామ్ ముంబైకి చేరుకున్న తర్వాత అక్కడ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఎక్కడా పని దొరకలేదు. తిరిగి ఇంటికి వెళ్దామంటే నాన్న కొడతాడన్న భయం. ఇలా కొన్నాళ్లపాటు పనికోసం వెతికిన జయరామ్ కు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతను రెస్టారెంట్ నడుపున్నాడు. ఆ విధంగా బనన్ ఆ రెస్టారెంట్ లో పనిలో చేరాడు. తనకు ఎలాంటి పనిచేయాలో తెలియదు. అప్పుడే రెస్టారెంట్లో పాత్రలు కడుగుతానని పనిలో చేరారు. పాత్రలు కడగడం అలవాటు చేసుుకున్నాడు. అప్పుడు ఆయనకు నెలకు రూ. 18 జీతం ఇచ్చేవారు. 6ఏండ్ల పాటు పాత్రలు కడిగాడు. జయరామ్ డెడికేషన్ చూసిన యజమాని మొదట వేయిటర్ గా ప్రమోషన్ ఇచ్చాడు. ఆ తర్వాత రెస్టారెంట్ కు మేనేజర్ ను చేశాడు. జీతం 18 రూపాయల నుంచి నెలకు 200 రూపాయలకు చేరింది.

Sagar Ratna's Jayaram Banan Success Story

స్నేహితుల వద్ద అప్పు :
జయరామ్ 1974లో ముంబై నుంచి ఢిల్లీకి వచ్చారు. సొంతంగా వ్యాపారం చేయాలని ఆలోచించాడు. ఢిల్లీలో సొంతంగా రెస్టారెంట్ తెరవాలనుకున్నాడు. ఇక్కడ అతను ఘజియాబాద్‌లోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ క్యాంటీన్‌ను నడపడం ప్రారంభించాడు. స్నేహితుల వద్ద అప్పు తీసుకుని తన సొంత పొదుపులో కొంత భాగాన్ని తీసుకుని ఈ పనిని ప్రారంభించాడు. 2000 మొదటి పెట్టుబడి పెట్టాడు. దీని తరువాత, 1986 సంవత్సరంలో, అతను తన మొదటి రెస్టారెంట్‌ను దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో సాగర్ అనే పేరుతో ప్రారంభించాడు. అతను ఈ రెస్టారెంట్ నుండి మొదటి రోజు రూ. 408 సంపాదించాడు.

Sagar Ratna's Jayaram Banan Success Story

రెస్టారెంట్ల సంఖ్య పెరిగింది:
జయరామ్ కష్టానికి ప్రతిఫలం దక్కడం షురూ అయ్యింది. జైరామ్ రెస్టారెంట్ వద్ద జనం రద్దీ పెరగడం మొదలైంది. ప్రజలు సౌత్-ఇండియన్ డిష్‌ని బాగా ఇష్టపడుతున్నారు. దీని తరువాత, అతను ఢిల్లీలోని లోధి మార్కెట్‌లో ఒక దుకాణాన్ని కూడా తెరిచాడు. అదే నాణ్యమైన ఆహారాన్ని 20 శాతం అధిక ధరలకు అందించడం ప్రారంభించాడు. ఈ విధంగా అతను తన స్టార్టప్ "సాగర్-రత్న" ప్రారంభించాడు. నేడు ఢిల్లీలోనే 30కి పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో దీని సంఖ్య 60కి పైగా పెరిగింది.

విదేశాల్లో కూడా అవుట్‌లెట్లు:
నేడు కెనడా, సింగపూర్, బ్యాంకాక్ వంటి దేశాల్లో కూడా వారికి అవుట్‌లెట్లు ఉన్నాయి. వీటన్నింటి వల్ల వారి వార్షిక టర్నోవర్ రూ.300 కోట్లకుపైగా చేరింది. సాగర్ రత్నతో పాటు 2001లో స్వాగత్ పేరుతో మరో రెస్టారెంట్ చైన్‌ను ప్రారంభించాడు. ప్రజలు అతన్ని 'దోస కింగ్ ఆఫ్ ది నార్త్' అని కూడా పిలుస్తారు. నేడు అతనికి ప్రపంచవ్యాప్తంగా 100 రెస్టారెంట్లు ఉన్నాయి. ఈరోజు జయరామ్ ఏటా కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు.

నిజాయితీగా, కష్టపడితే..ప్రతిఫలం దానంత అదే మన దగ్గరకు వస్తుందనడానికి ఉదాహరణ జయరామ్ జీవితం. చిన్న సమస్యకే కుంగిపోకుండా..కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతే సాధించలేనిది ఏదీ లేదు.

Also Read: చంపేసిన మూడనమ్మకం..గ్రహణ భయంతో తన భర్తను,పిల్లలను ఎలా చంపిదో తెలుసా?

#sagar-ratna #sagar-ratna-restaurant #jayaram-banan #jayaram-banan-sucess-storie
Advertisment
Advertisment
తాజా కథనాలు